Telugu News » Udayanidhi Stalin: పది రూపాయల దువ్వెన చాలు: ఉదయనిధి!

Udayanidhi Stalin: పది రూపాయల దువ్వెన చాలు: ఉదయనిధి!

తన తల అంటే ఆ సన్యాసికి ఎందుకు అంత ఇష్టమో తెలియదని ఉదయనిధి అన్నారు.

by Sai
will do it on my own if udayanidhi on seers 10 crore bounty for his head

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin)సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రగడ జరుగుతోంది. సనాతన ధర్మాన్ని అంతం చేయాలన్న ఉదయనిధిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

will do it on my own if udayanidhi on seers 10 crore bounty for his head

ఈ క్రమంలోనే అయోధ్యకు చెందిన సాధువు ఒకరు ఉదయనిధి తలను తెచ్చిచ్చిన వారికి రూ.10 కోట్ల నజరానా ఇస్తానని ప్రకటించారు. ఒకవేళ ఎవరూ ముందుకు రాకుంటే తానే స్వయంగా ఉదయనిధిని వెతికి పట్టుకుని ఆ పని పూర్తిచేస్తానని చెప్పారు. ఈ ప్రకటనపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు.

తన తల అంటే ఆ సన్యాసికి ఎందుకు అంత ఇష్టమో తెలియదని ఉదయనిధి అన్నారు. రూ. పది కోట్లు ఎందుకు, పది రూపాయల దువ్వెన ఇస్తే తానే తన తల దువ్వుకుంటానని చెప్పారు. ఛాప్, స్లిట్ అనే పదాలకు తమిళంలో తల దువ్వుకోవడమనే అర్థం ఉంది. ఈ అర్థాన్ని వాడుకుంటూ సాధువు హెచ్చరికను ఉదయనిధి తేలిగ్గా తీసిపారేశారు.

ఇలాంటి బెదిరింపులు తమ కుటుంబానికి కొత్తేంకాదన్నారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, మళ్లీ మళ్లీ అదే చెబుతానని స్పష్టం చేశారు. ఈమేరకు చెన్నై(Chennai)లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ సాధువుకు కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఉదయనిధి ప్రశ్నించారు

You may also like

Leave a Comment