లోక్‌సభ ఎన్నికలకు రోజులు సమీపిస్తుండటంతో బీజేపీ ప్రచారంలో దూకుడును పెంచింది. పార్లమెంట్ సన్నాహాక సమావేశాలను ఏర్పాటు చేసి కార్యకర్తలు, ముఖ్యనేతలతో సమావేశంలో అవుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి, బీజేపీ(BJP) స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి(G.Kishan reddy) నాంపల్లి పార్టీ ఆఫీసులో అఖిల భారతీయ బ్రహ్మణ్ ఆత్మీయ సమ్మేళనలంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ.. జైశ్రీరామ్ నినాదంపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. జైశ్రీరామ్ నినాదం ఏమైనా తిండి పెడుతుందా? రాముడు ఉద్యోగం ఇస్తాడా? అని అనడంతో.. కేంద్రమంత్రి మండిపడ్డారు.
మీ అయ్య కూడా హోమాలు, యాగాలు చేస్తాడు కదా!..దేనికోసం చేస్తున్నాడో అడుగు కేటీఆర్ అని ప్రశ్నించాడు. జైశ్రీరామ్ అని అనడం ఇష్టం లేకపోతే ‘అల్లాహ్ అక్బర్ అంటావా? అంత దమ్ముందా? కేటీఆర్ అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఒకవేళ రాముడిని విమర్శించినట్లే.. అల్లహ్ అక్టర్‌ను విమర్శించే అంత దమ్ముందా? అని ప్రశ్నించారు.
దేశంలో సనాతన ధర్మం లేకపోతే సెక్యులరిజం ఉండదని కిషన్ రెడ్డి ఆరోపించారు.ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఓటింగ్ పర్సంటేజీని పెంచాలని బ్రహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేడర్‌కు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా మూమెంట్ తీసుకురావాలన్నారు. గతంలో ఓటింగ్ పర్సంటేజీ తగ్గడం వల్లే వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు గుర్తుచేశారు.ఈసారి ఎలాగైనా హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ విజయం సాధించాలని, ఆ దిశగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.