భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) 73వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు పుట్టినరోజు (Birthday) శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu)ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. “ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన దూరదృష్టి, బలమైన నాయకత్వంతో ప్రతి రంగంలో దేశ అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరుకుంటున్నాను” అని రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు.
అదే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు భాజపా నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి ప్రధాని మోదీ గొప్ప సంపద అని ఆమె మోదీ గొప్పతనాన్ని అభివర్ణించారు.
అలాగే ఏపీ సీఎం జగన్, చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ తదితరులు కూడా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని జన్మదినం సందర్భంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు సేవా పక్షోత్సవాలను భాజపా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ… ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ‘మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధానికి సామాన్యులు సైతం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వీలుగా ‘ది నమో యాప్’ ను రూపొందించారు. ఆ యాప్ లోకి వెళ్లి ఎవ్వరైనా మోదీకి విషెస్ నేరుగా చెప్పొచ్చు.
73వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ప్రధాని మోదీకి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏపీ సీఎం జగన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు మోదీకి విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. అలాగే సోషల్ మీడియా ద్వారా నేతలు, ఇతర సెలబ్రెటీలు మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.