తెలంగాణలో నామినేషన్ల (Nominations) ఉపసంహరణ (Withdrawl) గడువు ముగిసింది. ఉపసంహరణ గడువు చివరి రోజున బుజ్జగింపులు, సంప్రదింపులు కనిపించాయి. చివరి రోజులు పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అదే సమయంలో కొందరు అభ్యర్థులు తాము రెబెల్ గా కొనసాగుతామని తేల్చి చెప్పారు.
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఇక ఈ ఎన్నికల్లో ఏ నియోజక వర్గం నుంచి ఎంత మంది బరిలో ఉంటారనే విషయం తేలి పోయింది. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఇప్పుడు ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఎవరికి వారు తమ ఎన్నికల వ్యూహాలను రెడీ చేసుకుంటున్నారు.
ఈ నెల 28 వరకే ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉంది. మరో 12 రోజుల మాత్రమే ప్రచారాని గడువు మిగిలి వుంది. దీంతో అభ్యర్థులు ప్రచార వేగాన్ని పెంచనున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి భారీగా బైక్ ర్యాలీలు, ప్రచార రథాలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారాలను ముమ్మరం చేసేందుకు పార్టీలు రెడీ అవుతున్నాయి.
ఇది ఇలా వుంటే అభ్యర్థులు ఎక్కువగా సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను కార్నర్ చేస్తూ విమర్శళు చేయడం, తమ మెనిఫెస్టోలను విస్తృతంగా షేర్ చేయడం, మీమ్స్, ప్రచార పాటల ద్వారా జనాలకు చేరువ కావాలని చూస్తున్నారు.