Telugu News » World Cup 2023: బంగ్లాదేశ్ తో భారత్ కు సవాల్..! –

World Cup 2023: బంగ్లాదేశ్ తో భారత్ కు సవాల్..! –

టీమిండియా వరుసగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌, పాక్‌లను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. బంగ్లాపై సైతం విజయాన్ని నమోదు చేయాలని భావిస్తోంది. కానీ ఇక్కడే చిన్న చిక్కు ఉంది. 2007 ప్రపంచకప్‌ను పలువురు గుర్తు చేసుకుంటున్న అభిమానులు బంగ్లాదేశ్ ఎప్పుడూ టీమిండియాను ఇబ్బంది పెడుతోందని అనుకొంటున్నారు.

by Venu
kohli

క్రికెట్ అభిమానులు ఇండియా (India) పై ఎన్నో ఆశలు పెట్టుకొన్నారు. ఐసీసీ (ICC) వన్డే వరల్డ్‌ కప్‌ (World Cup)లో భారత్ విజయం సాధించాలని కలలు కంటున్నారు. అయితే ఇప్పటి వరకు అభిమానుల ఆశలకు తగ్గట్టుగానే భారత్ జట్టు విజయపథంలో దూసుకు పోతోంది. మరోవైపు పుణే (Pune) వేదికగా భారత్‌, బంగ్లాదేశ్ (Bangladesh) జట్లు గురువారం తలపడనున్నాయి. కాగా ఈ మ్యాచ్‌ పై కాస్త ఉత్కంఠ వాతావరణం నెలకుంది, వర్ష సూచన ఉందన్న నేపథ్యంలో అభిమానులు కలవర పడుతున్నారు.

ఇప్పటికే టీమిండియా వరుసగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌, పాక్‌లను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. బంగ్లాపై సైతం విజయాన్ని నమోదు చేయాలని భావిస్తోంది. కానీ ఇక్కడే చిన్న చిక్కు ఉంది. 2007 ప్రపంచకప్‌ను పలువురు గుర్తు చేసుకుంటున్న అభిమానులు బంగ్లాదేశ్ ఎప్పుడూ టీమిండియాను ఇబ్బంది పెడుతోందని అనుకొంటున్నారు. ఎందుకంటే 2023 ఆసియా కప్‌లో భారత్ దూకుడు ప్రదర్శించిన బంగ్లా చేతిలో ఓడిపోయింది. ఇతర సందర్భాల్లోనూ బంగ్లాదేశ్ టీమిండియాను ఇబ్బందుల్లోకి నెట్టింది.

టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా గొప్ప బ్యాట్స్‌మెన్స్ ఉన్న కూడా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఈ ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఎప్పుడూ భారత్‌పై అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. తన తొలి రెండు వన్డేల్లోనే భారత్‌పై 11 వికెట్లు పడగొట్టాడు. 2019 ప్రపంచకప్ మ్యాచ్‌లో కూడా ఐదుగురు భారత బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు.

రర క్రమంలో బంగ్లాపై భారత్ పరుగుల వరద పారించడం అంత సులువు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారితే ఇరుజట్లకు ఒక్కో పాయింట్ ద‌క్కుతుంది. ఒక్క పాయింట్‌ వెనుకబడినా సెమీ ఫైనల్‌ రేసులో భార‌త్‌కు ఇబ్బందులు తప్పవని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇక‌ లీగ్‌ దశ పాయింట్ల పట్టికలో మొదటి 4 స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే సైమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ క్రమంలో వర్షంతో బంగ్లా మ్యాచ్‌కు ఆటంకం కలిగితే ఒక పాయింట్‌ను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ఊరట కలిగించే విషయం ఏంటంటే ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో వర్షం కారణంగా ఏ మ్యాచ్‌ కూడా రద్దుకాకపోవడం..

You may also like

Leave a Comment