భారత్, ఆస్ట్రేలియా(Ind vs Aus) ప్రపంచకప్ 2023(ODI World Cup final-2023) ఫైనల్ మ్యాచ్ ఇవాళ అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోడీ స్టేడియం(Narendra Modi Stadium)లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగితే విజేత ఎవరనే సందేహం అందరిలో ఉంది.
వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఆట సాధ్యం కాకపోతే రిజర్వ్ డే నవంబర్ 24 కొనసాగిస్తారు. ఆరోజు కూడా మ్యాచ్ సాధ్యం కాక రద్దయితే టోర్నీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ ఆడిస్తారు. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా టై అయితే ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్లు నిర్వహిస్తారు.
గత ప్రపంచకప్ మాదిరి బౌండరీల కౌంట్ అనే అసంబద్దమైన నిబంధనను ఉపయోగించారు. ఈ రూల్‌ను మెరీలీబోన్ క్రికెట్ క్లబ్ రద్దు చేసింది. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఈ రూల్ ద్వారానే ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలవడం విశేషం. న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఉత్కంఠ సాగిన ఆ ఫైనల్ పోరులో ఇరుజట్ల స్కోర్లు టై అయ్యాయి. సూపర్ ఓవర్ నిర్వహించగా మళ్లీ స్కోర్లు టై అయ్యాయి. దాంతో బౌండరీ కౌంట్‌తో ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు.
అయితే, వాతావరణం సహకరిస్తుందా? లేదా అనే అనుమానాల నేపథ్యంలో వాతావరణశాఖ క్లారిటీ ఇచ్చింది. వర్ష సూచనలేదని పేర్కొంది. వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని, దాదాపు 32 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అయితే, 17 నుంచి 19 కి. మీ వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు వెల్లడించింది.