ఇంగ్లండ్(England)తో మ్యాచ్‌కు ముందు టీమిండియా(Team India)కు బిగ్ షాక్ తగిలేలా ఉంది. శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Team India Captain) గాయపడ్డాడు(Injured). దీంతో కీలకమైన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ మేరకు పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ వెల్లడించాయి. దీంతో అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.
జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ కథనాల ప్రకారం.. శనివారం నెట్స్‌లో రోహిత్ శర్మ బాగా కష్టపడుతున్నాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బౌలర్ విసిరిన బంతి హిట్‌మ్యాన్ కుడి చేతి మణికట్టుకు బలంగా తగిలింది. దీంతో రోహిత్ నొప్పితో బాధపడినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఫిజియో వచ్చి రోహిత్ గాయాన్ని పరిశీలించాడు. అనంతరం రోహిత్ శర్మ మళ్లీ ప్రాక్టీస్‌కు రాలేదు.
అయితే హిట్‌మ్యాన్ గాయం తీవ్రత ఏ స్థాయిలో ఉందనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అటు బీసీసీఐ కూడా రోహిత్ శర్మ గాయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ విషయంపై సందిగ్దత నెలకొంది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగే అవకాశాలు లేవని తెలుస్తోంది.
ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ జట్టుకు అద్భుత ఆరంభాలను ఇస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కువ పరుగులు రాబడుతున్నాడు. అద్భుతమైన కెప్టెన్సీని ప్రదర్శిస్తూ జట్టును పటిష్ట స్థితిలో నిలుపుతున్నాడు. ఈ క్రమంలో రోహిత్‌కు గాయం కావడం పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. మరోవైపు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.