వన్డే ప్రపంచకప్(Woldcup)లో వరుస విజయాలతో దూకుడుమీదున్న టీమిండియాకు(Team India) మరో గుడ్ న్యూస్ అందింది. కొద్దిరోజుల క్రితం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడి న్యూజిలాండ్‌తో పాటు ఇంగ్లండ్ మ్యాచ్‌లకూ దూరమైన హార్ధిక్ పాండ్యా(Hardik Pandya) త్వరలోనే భారత జట్టుతో కలవనున్నట్లు సమాచారం.
కొద్దిరోజుల క్రితం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడి న్యూజిలాండ్‌తో పాటు ఇంగ్లండ్ మ్యాచ్‌లకూ దూరమైన హార్ధిక్ పాండ్యా త్వరలోనే భారత జట్టుతో కలవనున్నాడు. నవంబర్ 2న భారత జట్టు ముంబై వేదికగా శ్రీలంకతో తలపడనుంది. ఈమ్యాచ్ నాటికి హార్ధిక్ పాండ్యా ముంబైలో జట్టుతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
‘బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘అవును, పాండ్యా ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్నాడు. త్వరలోనే అతడు ముంబైలో టీమిండియాతో కలుస్తాడు. అయితే అతడు లంకతో మ్యాచ్‌లో ఆడతాడనేది మాత్రం కచ్చితంగా చెప్పలేం. కానీ అతడు జట్టుతో పాటు కొనసాగుతాడు..’ అని తెలిపాడు.
వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా ఇదివరకే సెమీస్ బెర్తును కన్ఫామ్ చేసుకుంది. ఇకనుంచి భారత్ ఆడబోయే మ్యాచ్‌ల్లో ఒక్క సౌతాఫ్రికా మాత్రమే కాస్త కఠినమైన ప్రత్యర్థిగా కనిపిస్తోంది. కాలి మడమ గాయంతో బాధపడుతున్న పాండ్యా కోలుకుని మైదానంలో అడుగుపెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Hardik Pandya has resumed the batting and gym session. [RevSportz]
– Great news for Team India…..!!!!! pic.twitter.com/8JF7Zj0zJw
— Johns. (@CricCrazyJohns) October 28, 2023