హైదరాబాద్(Hyderabad) ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో తొలి టెస్టు ఓటమితో నిరాశలో ఉన్న టీమిండియా(Team India)కు బిగ్‌షాక్ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌సిప్(WTC 2023-25) పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. ఐదు టెస్టుల్లో రెండింటిలో మాత్రమే గెలిచిన రోహిత్ సేన విజయాల శాతం 43.33గా ఉంది.
బజ్ బాల్ ఆటతో చెలరేగిన బెన్ స్టోక్స్ సేనకు బదులివ్వలేక 28 పరుగుల తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది. దాంతో, డబ్ల్యూటీసీ పట్టికలో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే.. మిగతా నాలుగు టెస్టుల్లో గెలిస్తే టీమిండియా టాప్‌లోకి దూసుకెళ్లే చాన్స్ ఉంది. అదే జరిగితే ముచ్చటగా మూడోసారి భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్‌సిప్ ఫైనల్‌కు దూసుకెళ్తుంది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌సిప్‌లో తిరుగులేని రికార్డు ఉన్న భారత్ కొత్త ఏడాదిలో దక్షిణాఫ్రికాపై విజయాన్ని అందుకుని శుభారంభాన్ని కొనసాగించింది. అప్పుడు డబ్ల్యూటీసీ పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కానీ సొంతగడ్డపై మాత్రం తేలిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్ జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా ఓడిపోయింది.
ఇక, కివీస్ గడ్డపై చారిత్రాత్మక విజయం సాధించిన బంగ్లాదేశ్ నాలుగో ప్లేస్ దక్కించుకుంది. స్వదేశంలో పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేసి వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ సమం చేసుకున్న ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్‌లో ఉంది. దక్షిణాఫ్రికా 50శాతంతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ జట్టు 50శాతంతో మూడో స్థానంలో నిలిచాయి.