తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారం మొదలైన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ (BRS) దూసుకెళ్తుంది. మరోవైపు బరిలో ఉన్న అభ్యర్థుల హామీలతో రాష్ట్రం హోరెత్తి పోతుంది. విమర్శలు లక్ష్యంగా.. చేసిన అభివృద్ధి ధ్యేయంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు రాజకీయ నేతలు. ఈ నేపధ్యంలో కొన్ని చోట్ల ప్రచారం నిర్వహిస్తున్న నేతలకు నిరసన సెగలు స్వాగతం పలుకుతున్నాయి.
తాజాగా మరో బీఆర్ఎస్ అభ్యర్థికి ఇలాంటి అనుభవం ఎదురైంది. యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri)భువనగిరి మున్సిపాలిటీ రాయగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డి (Sekhar Reddy) కూతురు మన్విత రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి ఎమ్మెల్యే గా పైళ్ల శేఖర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ 3, 4 వార్డుల్లో ప్రచారం చేస్తున్న క్రమంలో RRR బాధితులు మన్వత ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
తమకు ఏం న్యాయం చేశారని ఆర్ఆర్ఆర్ బాధితులు ప్రశ్నించారు. గతంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఆర్ఆర్ఆర్ బాధితులను ఫైళ్ళ శేఖర్ రెడ్డి అక్రమ అరెస్టు చేపించి, కేసులు బనాయించి, జైలులో నిర్బంధించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. అన్యాయం అయిన తమకు న్యాయం కావాలని.. మన్వత గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
రాయగిరిలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపధ్యంలో మన్వితతో పాటు ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్ లీడర్లకు, RRR బాధితులకు మధ్య తోపులాట చోటు చేసుకోంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు ఏ ఇబ్బందులు లేవని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పుకోవడం సిగ్గుచేటని కడుపులు కాలుతున్న ప్రజలు అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది.