తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఊహించని విధంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) పార్టీదే హవా కొనసాగింది. కానీ అనుకోకుండా ఆ పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తున్నది. అందుకు ఆ పార్టీ నేతల చర్యలు, ఆరు గ్యారెంటీల అమలు ఫెయిల్ కావడమే కారణంగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలని బీఆర్ఎస్ నేతలు స్కెచ్ గీస్తున్నారు. ఇప్పటికే అన్నదాతలు కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్నారు. రుణమాఫీ, వరికి బోనస్ వంటి హామీలను కాంగ్రెస్ నేరవేర్చలేదు. దీనికి తోడు మార్కెట్లో అధికారులు, దళారులు కుమ్మక్కై రైతులను దగా చేస్తున్న ప్రభుత్వం నుంచి చర్యలు కొరవడ్డాయి.
దీనిని క్యాష్ చేసుకోవాలని గులాబీ బాస్, ఆ పార్టీలోని కీలక నేతలు, నియోజకవర్గ ఇంచార్జులు ఆలోచిస్తున్నారు. తాజాగా కంటోన్మెంట్ బీఆర్ఎస్ కీలక నేత మన్నె క్రిశాంక్ (Brs leader Manne Krishank) కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టు ఒకటి వైరల్ అవుతోంది.
Some politicians can never understand KCR garu’s Asset Building …. pic.twitter.com/Y8d2L7eaFj
— Krishank (@Krishank_BRS) April 16, 2024
యాదాద్రి టెంపుల్ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాగా పెరిగిందని, మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.225 కోట్ల ఆదాయం వచ్చిందని, గతేడాది కంటే రూ.55 కోట్ల ఆదాయం ఎక్కువగా పెరిగిందని ఓ వార్తా పేపర్‌కు సంభందించిన క్లిప్‌ను ట్విట్టర్లో పోస్టు చేశారు. అనంతరం ఇలా రాసుకొచ్చారు. ‘కొందరు రాజకీయ నాయకులకు కేసీఆర్ గారు పెంచిన ఆస్తుల విలువ అర్థం కావడం లేదని’.. కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించే క్రిశాంక్ ఈ ట్వీట్ అని చేశారని ప్రస్తుత రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.