యాదాద్రి (Yadadri)ఆలయ ఈవో (EO) రామకృష్ణ రావును బదిలీ చేస్తున్నట్లు తెలంగాణ (Telangana) ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) యాద్రాద్రి పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)ను వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చే సమయంలో మిగతా మంత్రుల కంటే కాస్త తక్కువ ఎత్తున్న స్టూల్‌పై కూర్చోబెట్టారు.

మరోవైపు యాదాద్రి ఆలయ ఈవోగా భాస్కరరావును బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. దీంతో తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల నోర్లకు తాళం పడినట్లే అని భావిస్తున్నారు.. ఇక ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు నానా యాగీ చేసిన విషయం తెలిసిందే.. అయితే నష్ట నివారణ చర్యల్లో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆలయ ఈవో రామకృష్ణరావుపై ట్రాన్స్ ఫర్ వేటు వేసింది. ఆయన స్థానంలో భాస్కర్‌రావుని ఆలయ ఈవోగా ప్రభుత్వం నియమిస్తూ జీవో జారీ చేసింది.