ఏపీ (AP) మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు (Chandrababu ) అరెస్ట్ టీడీపీ (TDP) నేతలకి తలనొప్పిగా తయారైంది. ఎన్నికల ప్రచారాలు నిర్వహించాలో, బాబు అరెస్ట్ విషయం పై చర్చలు జరపాలో అర్ధం కానీ స్థితిలో ఉన్నారు. ఇదే సమయంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి మంచి స్టఫ్ దొరికినట్టు అయ్యింది. కావలసినంత ప్రచారం చేసుకోవచ్చు..
కాగా ప్రస్తుతం నారా లోకేశ్ (Lokesh) పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల తయారైందని వైసీపీ అభిమానులు అనుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో మంత్రి అంబటి రాంబాబు మరో పిడుగులాంటి వార్త చెప్పారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ అడ్డంగా బుక్కయ్యారని అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో లోకేశ్ తప్పించుకోవడం అసాధ్యమని రాజకీయ బాంబు పేల్చారు.
అసలే చంద్రబాబు అరెస్ట్‌తో కుంగిపోతున్న టీడీపీకి, అంబటి మాటలు పుండు మీద కారం చల్లినట్టు ఉన్నాయి. అసలే ఎన్నికలు సమీపిస్తున్నాయి. చంద్రబాబు బయటికి వస్తే గాని టీడీపీకి బలం రాదు. ఒకవేళ బాబు అరెస్ట్ ఏ విధంగా సానుభూతి మూటగడుతుందో ఊహించడం కష్టం. ఈ సమయంలో బాబు వారసుడు లోకేశ్ కూడా జైలుపాలైతే తమ పార్టీ పరిస్థితి ఏంటని టీడీపీ నేతలు మధనపడుతున్నారని పొలిటికల్ సర్కిల్ ల్లో వార్తలు గుప్పుమంటున్నాయి.
లోకేశ్ తప్పించుకోలేడని అంబటి అన్నారంటే… వైసీపీ పెద్ద కుట్రే చేస్తోందని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఆ కుట్రలో భాగంగా బాబుని, లోకేశ్ ని కేసుల్లో ఇరికించి ఎన్నికలయ్యే వరకూ బయటికి రాకుండా చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.. మొత్తానికి టీడీపీ పరిస్థితి డ్రైవర్ లేని బండిలా మారిందని వైసీపీ అభిమానులు ఆనందిస్తుండగా, టీడీపీ సానుభూతి పరులు దీర్ఘాలోచనలో ఉన్నారు..