Telugu News » Yogi Adityanath: యూపీలో తగ్గిన నేరాలు.. NCRB నివేదికలో కీలక విషయాలు..!

Yogi Adityanath: యూపీలో తగ్గిన నేరాలు.. NCRB నివేదికలో కీలక విషయాలు..!

ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన యోగి ఆదిత్యనాథ్‌ నేరాలు నియంత్రించడంలో సఫలం అయ్యారు. ఈ సంస్థ గణాంకాల ప్రకారం 2022లో యూపీలో ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోలేదని తేలింది.

by Mano
Yogi Adityanath: Reduced crime in UP.. Key points in NCRB report..!

ఒకప్పుడు దేశానికి నేర రాజధానిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేరాలు నియంత్రించడంలో సఫలం అయ్యారు. ఆయన ముఠా నాయకులపై ఉక్కుపాదం మోపినట్లు బీజేపీ నాయకులు తరచూ ప్రశంసిస్తూ ఉంటారు. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన యోగి ఆదిత్యనాథ్‌ నేరాలు నియంత్రించడంలో సఫలం అయ్యారు. ఈ సంస్థ గణాంకాల ప్రకారం 2022లో యూపీలో ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోలేదని తేలింది.

 

అయితే, గడిచిన ఐదేళ్లలో నేరాలు ఏకంగా 50 శాతం తగ్గాయని ఎన్‌ఆర్‌సీబీ తెలిపింది. ఇక అస్సాంలో సైతం అల్లర్లు తగ్గుముఖం పట్టాయని నివేదికలో తేలింది. ఇక్కడ ఏకంగా 80 శాతం నేరాలు తగ్గినట్లు చెప్పింది. అదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో నేరాల సంఖ్య పెరిగినట్లు జాతీయ నేర గణంకాల సంస్థ తెలిపింది.

ఛత్తీస్‌గఢ్‌లో నేరాల సంఖ్య 44 శాతం మేర పెరిగాయి. 2018 నుంచి 2022 వరకు దేశ వ్యాప్తంగా మతపరమైన అలర్ల ఘటనలు 34 శాతం తగ్గాయని నివేదికలో తెలిపింది. 2021లో సగటున మతపరమైన అల్లర్లు 378 ఉండగా, 2022 నాటికి 272కి తగ్గాయి. 2022లో మధ్యప్రదేశ్‌లో 68, బీహార్‌లో 60, జార్ఖండ్‌లో 46 మతపరమైన అల్లర్లు తగ్గినట్లు NCRB నివేదికలో వెల్లడించింది. అయితే, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఇలాంటి ఒక్కటి ఘటన చోటుచేసుకోకపోవడం విశేషం.

ఇక గతేడాది దేశంలోనే అత్యధిక రాజకీయ అల్లర్లు కేరళలో జరిగినట్లు తెలిపంది. సుమారు ఇక్కడ 301 సంఘటనలు చోటు చేసుకున్నట్లు వివరించింది. అలాగే ఒడిశాలో 224, మహారాష్ట్రలో 86 అల్లర్లు జరిగాయి. 2018 -2022 మధ్య కాలంలో దేశంలో హత్యలు తగ్గుముఖం పట్టాయి. గడిచి 5 ఏళ్లలో మహిళలపై అత్యధికంగా దాడులు జరిగిన రాష్ట్రాల్లో రాజస్థాన్ (61.7%), తమిళనాడు (58.1%) ముందు వరుసలో ఉన్నట్లు NCRB నివేదికలో స్పష్టం చేసింది.

You may also like

Leave a Comment