కాంగ్రెస్ (Congress)పై యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ (Yogi Adityanath) తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. దేశ విభజనకు ( partition of the country) కారణం కాంగ్రెస్సే అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆ పార్టీకి అధికార దాహం లేకుంటే దేశం ఈ రోజు ఇలా ముక్కలుగా అయ్యేది కాదన్నారు. అంతా కలిసి సమైక్యంగా ఉండి ఉండేదని చెప్పారు.
1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే సోమనాథ్ పునరుజ్జీవనానికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారని తెలిపారు. కానీ అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దీన్ని వ్యతిరేకించారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్ పూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం యోగీ పాల్గొని ప్రసంగించారు. మధ్యప్రదేశ్ ప్రజల పక్షాన బీజేపీ నిలబడుతోందని చెప్పారు.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అరాచకాలు, గూండాయిజానికి వ్యతిరేకంగా పాదరక్షలు లేకుండా పోరాటాలు చేసి గొప్ప పోరాట యోధుడు బీజేపీ నేత ప్రహ్లాద్ సింగ్ పటేల్ అని యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. ప్రజలు ఇప్పటికే ప్రహ్లాద్‌జీని తమ నాయకుడిగా భావిస్తున్నారని, ఆయన నేతృత్వంలో నిరంతరం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఇక్కడ వేలాది మంది జనాలే సాక్షి అన్నారు.
ఇది ఇాలా వుంటే మొదటి సారిగా యూపీ కేబినెట్ సమావేశాన్ని అయోధ్యలో నిర్వహించనున్నారు. దీపావళి వేడుకలు, రామ మందిర నిర్మాణ పనుల పురోగతిపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. సుమారు నాలుగు గంటల పాటు సీఎం యోగీ అయోధ్యలో గడుపుతారని అధికార వర్గాలు వెల్లడించాయి.