అన్నా చెల్లెళ్ల మధ్య పోరు ఏపీ రాజకీయాలకు ప్రధాన ఆకర్షణగా మారిందంటున్నారు. దానికి ప్రధాన కారణం.. వైఎస్ షర్మిల (YS Sharmila)ను పార్టీలోకి తీసుకొని అధిష్ఠానం పీసీసీ పగ్గాలను అప్పగించడం. ఇలా ఏపీ కాంగ్రెస్ (Congress)కు దిక్సూచిలా కనిపించిన ఆమెకు రాష్ట్ర పగ్గాల అప్పగింత ఎన్నికల్లో సానుకూల ప్రభావమే చూపించేలా కనిపిస్తోందని అనుకొంటున్నారు. అయితే షర్మిల రాక ముఖ్యంగా వైసీపీ (YCP)కి ఇబ్బందిలా మారొచ్చని భావిస్తున్నారు.
ఇక ఏపీ నుంచి దూసుకొచ్చిన బాణం తెలంగాణలో తిరిగి తిరిగి.. కాంగ్రెస్ గాలి తోడవడంతో దిశ మార్చుకొని చివరకు ఏపీకి చేరింది. అయితే ఈ బాణం ఏపీలో ఓ గైడెడ్ మిస్సైల్ లా ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేసిన తొలి ప్రసంగంలో వివాదస్పందంగా మారింది. టార్గెట్ వన్ జగన్ రెడ్డి కాగా, టార్గెట్ 2 చంద్రబాబు, టార్గెట్ 3 బీజేపీ. పార్లమెంట్ ఎన్నికల వేళ త్రీ టార్గెట్స్ తో జగనన్న బాణం కాస్తా.. కాంగ్రెస్ వదిలిన బాణంగా మారింది.
ఏనాడూ తన అన్న సీఎం జగన్ (Jagan)పై విమర్శలు చేయని షర్మిల.. ప్రస్తుతం ఆయన్ను టార్గెట్ చేసినట్టు మాట్లాడుతోందనే టాక్ మొదలైంది. ప్రధానంగా ప్రత్యేకహోదా అంశంలో జగన్ తీరును ఎండగట్టారు. ప్రతిపక్ష నేతగా ‘హోదా’పై విమర్శలు చేసిన జగన్.. సీఎం అయ్యాక ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేశారా? అని ప్రశ్నించారు. మరోవైపు వైసీపీకి బలమైన క్రిస్టియన్ ఓటు బ్యాంక్ టార్గెట్ గా విమర్శలు చేశారు..
మణిపుర్‌లో క్రైస్తవులపై దాడులు జరిగితే ఎందుకు బీజేపీని ప్రశ్నించలేదని షర్మిల నిలదీశారు. ముఖ్యంగా జగన్ ఓ క్రిస్టియన్‌గా ఉండి కూడా ఎందుకు మాట్లాడ లేదంటూ ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే జగన్ పదవుల కోసం ఎంతకైనా వెళ్తాడనే ప్రచారం మొదలైంది. ఇందులో భాగంగా వైసీపీ తమ పాలసీని అమలు చేయడం ప్రారంభించిందనే సంకేతాలు మొదలైయ్యాయి..
అమెరికాలో ఉండే ఓ వెటర్నరీ డాక్టర్ తో షర్మిల కుటుంబంపై దారుణమైన నిందలతో విరుచుకుపడేలా చేయడమే కాకుండా వాటిని వైసీపీ సోషల్ మీడియా సర్క్యూలేట్ చేయడం దీనికి సాక్ష్యంగా కనిపిస్తోందని అనుకొంటున్నారు. ప్రశ్నించిన వారిపై వ్యక్తిగత, వ్యక్తిత్వ దాడులకు దిగుతారు. ఇప్పుడు షర్మిల పైనా అదే పాలసీ అమలు చేస్తున్నారని, అసలు వైసీపీ విధానమే ఇది అనే ఆరోపణలు మొదలైయ్యాయి.. ఇలా ఎన్నికలు ముగిసే వరకు ఇంకా ఎన్ని ఘోరాలు చూడవలసి వస్తుందో అనే అనుమానాలు ఏపీలో మొదలైనట్టు చెబుతున్నారు.