వైటీపీ (YTP) అధ్యక్షురాలు (Sharmila) షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ (Congress) తో చర్చలు విఫలమయ్యాయి.. అన్ని స్థానాల్లో పోటీకి దిగుతున్నామని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన ఆమె.. తాజాగా మాట మార్చారు. పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ (Hyderabad) లో మీడియాతో మాట్లాడిన షర్మిల.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు.
కేసీఆర్ (KCR) ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి తాము మద్దతు తెలుపుతున్నట్టు తెలిపారు షర్మిల. తెలంగాణ సీఎంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆమె.. ఆ ఓట్లు చీలితో మళ్లీ ఆయనే సీఎం అవుతారని.. అది జరగకుండా ఉండేందుకు తాము కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నట్టు వివరించారు. అదీగాక, తమకు విజయ అవకాశం ఉందని కాంగ్రెస్ కోరిన నేపథ్యంలో మద్దతు తెలిపినట్టు తెలిపారు.
వైటీపీ కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు షర్మిల. కేసీఆర్ ను గద్దె దించడం చాలా అవసరమన్న ఆమె.. కాంగ్రెస్ పార్టీ ఈసారి గలవాలని కోరుకున్నారు.
నిజానికి వైటీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని తెగ ప్రయత్నించారు షర్మిల. ఢిల్లీకి వెళ్లి హస్తం పెద్దలతో చర్చలు జరిపారు. కానీ, వర్కవుట్ కాలేదు. పార్టీలోని ఓ వర్గం ఈ విలీన ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు షర్మిల. అయితే.. కేసీఆర్ ను ఓడించడానికి పార్టీల మద్దతు కోరుతోంది కాంగ్రెస్. ఈ క్రమంలోనే టీజేఎస్ సపోర్ట్ ఇవ్వగా.. ఇప్పుడు షర్మిల కూడా అదే బాటలో నడిచారు.