Telugu News » Sharmila : ఇదేనా అమరవీరుల ఆశల తెలంగాణ?

Sharmila : ఇదేనా అమరవీరుల ఆశల తెలంగాణ?

అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో కేసీఆర్ పాలన సాగడం లేదని ఆరోపణలు చేశారు.

by admin

తెలంగాణలో దుర్మార్గ పాలన సాగుతోందని విమర్శలు చేశారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila). 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) లోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నో మతాలు, కులాలు, భాషలతో భిన్నత్వంలో ఏకత్వంగా భారత దేశం (India) విరాజిల్లుతోందన్నారు. దేశంలో స్వేచ్ఛా, సమానత్వాలను రక్షిస్తూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ పరిపాలించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలిపారు.

YS Sharmila Speech after Hoists national Flag at Party Office

దేశానికి స్వాతంత్య్రం మాదిరిగానే తెలంగాణ కూడా ఎందరో ప్రాణ త్యాగాలు, మరెందరో పోరాటాల వల్ల వచ్చిందన్నారు షర్మిల. కానీ, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో కేసీఆర్ (KCR) పాలన సాగడం లేదని ఆరోపణలు చేశారు. రూ.4 లక్షల కోట్ల అప్పు తెచ్చి రాష్ట్రాన్ని నడిపితే.. పాలన అంటారా? అంటూ మండిపడ్డారు. కేసీఆర్ ది దిక్కుమాలిన పాలన అని విమర్శలు చేశారు. రాష్ట్రంలో అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు కూడా మహిళలు రోడ్లపై తిరిగే పరిస్థితి లేదన్నారు.

మద్యం ఏరులై పారుతోందని.. గుడులు, బడుల కంటే వైన్ షాపులు, బెల్ట్ షాపులే ఎక్కువగా వున్నాయని అన్నారు షర్మిల. మద్యం అమ్మకాలనే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా కేసీఆర్ మార్చేశారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మద్యం అమ్మకాలు పదింతలు పెరిగాయని.. ఇందుకోసమేనా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నది? అని ప్రశ్నించారు. ఇక, కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకుని బిన్నత్వంలో ఏకత్వంగా సాగిన భారత సంస్కృతిని కొనసాగించాలని కోరారు షర్మిల.

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ లో ప్రజాప్రస్థానం

షర్మిల పేరు ఇండియన్ బుక్‌ రికార్డ్స్‌ (Indian Book Of Records) లోకి ఎక్కింది. ఈమె చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అందులో చోటు దక్కింది. 2021, అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు ఏడాదిన్నర పాటు ఈ యాత్ర సాగింది. తెలంగాణలో 3,800 కిలో మీటర్లు నడిచారు. ఈ నేపథ్యంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ లో షర్మిల చోటు సంపాదించారు. ఇన్ని కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు.

You may also like

Leave a Comment