మహిళా రిజర్వేషన్ బిల్లు ( Woman Reservation Bill) పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ ఆర్ టీపీ అధినేత్రి షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మొదట బీ ఆర్ఎస్ ప్రకటించిన సీట్లలో 33 శాతం రిజర్వేషన్ ను తక్షణమే అమలు చేయాలని సవాల్ విసిరారు. బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు సమాన హక్కులు కల్పించిన రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని కోరారు.
మహిళా రిజర్వేషన్ వల్ల తన ఎమ్మెల్యే సీటు కోల్పోయినా పర్వాలేదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ వరకు ఎందుకనీ ఇప్పుడు కూడా రాజీనామా చేసి ఆ సీటు మహిళకు ఇవ్వవచ్చన్నారు. మీ సీటు ఇప్పుడు మహిళకు ఇస్తే మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రకటించిన సీట్లలో మహిళలకు 33 శాతం సీట్లను
అమర వీరుడు శ్రీకాంత చారి తల్లి ఎన్నికల్లో ఓడి పోయినప్పుడు ఆమెకు ఎందుకు పదవి ఇవ్వలేదని ఆమె నిలదీశారు. కానీ కవిత ఓడిపోయినప్పుడు మాత్రం ఆమె కేసీఆర్ బిడ్డ అన్న కారణంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటూ మండిపడ్డారు. దమ్ముంటే మీ సీట్లను ఇప్పుడే త్యాగం చేయాలంటూ ఆమె సవాల్ విసిరారు. అంతకు ముందు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహిళా బిల్లును తాను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. మహిళలు రాజకీయాల్లోకి రావాలన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం తన సిరిసిల్ల సీటును వదులు కునేందుకు కూడా తాను సిద్ధంగా వున్నానన్నారు. మనందరివీ చాలా చిన్న జీవితాలని, అందులో తాను తన పాత్ర పోషించానన్నారు.