Telugu News » YS Sharmila: ఉండవల్లిలో ఉద్రిక్తత.. వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు..!

YS Sharmila: ఉండవల్లిలో ఉద్రిక్తత.. వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు..!

మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు(President of AP Congress) వైఎస్ షర్మిల(YS Sharmila) చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్ షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

by Mano
YS Sharmila: Tension in Undavalli.. Police arrested YS Sharmila..!

మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు(President of AP Congress) వైఎస్ షర్మిల(YS Sharmila) చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఉండవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షర్మిల గురువారం పార్టీ కార్యకర్తలతో కలిసి సెక్రేటరియట్ ముట్టడికి బయలుదేరారు.

YS Sharmila: Tension in Undavalli.. Police arrested YS Sharmila..!

ఈ క్రమంలో వైఎస్ షర్మిను పోలీసులు ఉండవల్లి వద్ద అడ్డుకోవడంతో ఆమె రోడ్డుపైనే నిరసనకు దిగారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వెనక్కి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో అరెస్టు చేసి మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. దీంతో ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను కూడా అరెస్ట్ చేశారు.

అంతకుముందు ఉదయం నుంచే ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఛలో సెక్రటేరియట్‌ను అడ్డుకునేందుకు పోలీసులు బుధవారం రాత్రి నుంచే కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టారు. దీన్ని గమనించిన వైఎస్ షర్మిల విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లోనే రాత్రి బస చేశారు. గురువారం ఉదయం విజయవాడ నుంచి సచివాలయానికి వైఎస్ షర్మిల పాదయాత్రగా బయలుదేరారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి షర్మిల మానవహారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలని, నాయకుల్ని విడుదల చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీ గతంలో ఇచ్చిన 23 వేల పోస్టుల మెగా డీఎస్సీ హామీని నిలబెట్టుకోకుండా కేవలం 6వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటన చేయడంపై వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. డీఎస్సీ ప్రకటన నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు.

You may also like

Leave a Comment