Telugu News » assam bjp mp: బీజేపీ ఎంపీ ఇంట్లో బాలుడి ఆత్మహత్య!

assam bjp mp: బీజేపీ ఎంపీ ఇంట్లో బాలుడి ఆత్మహత్య!

తల్లి మొబైల్ ఫోన్ ఇవ్వనందుకు అతను బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

by Sai
10 year old boy who hanged himself at the house of an assam bjp mp

అస్సాం బీజేపీ ఎంపీ(bjp mp) ఇంట్లో 10 సంవత్సరాల బాలుడు ఉరివేసుకుని చనిపోవడం సంచలనం కలిగించింది. బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.అస్సాం సిల్చార్‌లోని బీజేపీ ఎంపీ రాజ్‌దీప్ రాయ్ ఇంట్లో ఉరివేసుకుని ఉన్న 10 ఏళ్ల బాలుడి మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది.

10 year old boy who hanged himself at the house of an assam bjp mp

5 వ తరగతి చదువుతున్న బాలుడు కొన్నేళ్లుగా తల్లి, అక్కతో కలిసి ఎంపీ ఇంట్లో ఉంటున్నాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కి తరలించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎంపీ రాజ్ ‌రాయ్ ఇంటికి చేరుకున్నారు. బాలుడు చనిపోయిన వెంటనే తనకు సమాచారం అందిందని.. బాలుడు చనిపోయిన గది తలుపు లోపలివైపు మూసి ఉండటంతో పగులగొట్టామని రాయ్ చెప్పారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని వైద్యుడు బాలుడు చనిపోయినట్లు ప్రకటించారని రాయ్ తెలిపారు.

ప్రాథమిక విచారణలో ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నా అసహ మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీడియో గేమ్ ఆడేందుకు తల్లి మొబైల్ ఫోన్ ఇవ్వనందుకు అతను బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

You may also like

Leave a Comment