Telugu News » miryalaguda: అభివృద్ధి పథంలో మిర్యాలగూడ!

miryalaguda: అభివృద్ధి పథంలో మిర్యాలగూడ!

ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబాటుకు గురైన మిర్యాలగూడ (miryalaguda) నియోజకవర్గం..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతుంది.

by Sai
miryalaguda development

ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబాటుకు గురైన మిర్యాలగూడ (miryalaguda) నియోజకవర్గం..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో వేలకోట్ల రూపాయల నిధులతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పథం లో ముందుకు నడిపిస్తున్న వైనం పై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం..

miryalaguda development

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో 1, 785 కోట్లతో పనులు జరిగాయి పల్లె పట్టణం అనే తేడా లేకుండా రహదారులు వేశారు ప్రభుత్వం విద్య వైద్య వ్యవస్థను బలోపతం చేసి కార్పొరేట్ స్థాయి సేవలను పేదలకు అందుబాటులోకి తెచ్చారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు కృషితో అభివృద్ధి సంక్షేమం విరాజిల్లుతుంది దేశంలోనే అతిపెద్ద యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను దామచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్నారు.

ఇది ఎంతోమంది కి ఉద్యోగ ఉపాధి కేంద్రంగా మారనుంది. మిర్యాలగూడ ఏరియా దావఖానను 300 పడకలకు పెంచడం తో పాటు ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు రూ 14 కోట్ల మంజూరయ్యాయి. డయాలసిస్ కేంద్రం ఏర్పాటుతో కిడ్నీ బాధితులకు ఊరట కలిగింది. దామరచర్ల,అడవిదేవులపల్లి, మాడుగుల పల్లి మండలాలలో 1000 కోట్ల రూపాయలతో చేపట్టిన లిఫ్ట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ 56 కోట్లతో 12 చెక్ డ్యాముల నిర్మాణం జరుగుతుంది.

మన ఊరు మనబడి పథకంలో భాగంగా రూ 40 కోట్లతో 70 పాఠశాలల పునర్నిర్మానాన్ని పనులు చేపట్టగా విద్యార్థులకు సగర సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. 5.60 కోట్లతో 28 గ్రామీణ ఆస్పత్రి భవనాలు మిర్యాలగూడ మున్సిపాలిటీలో రూ 80 లక్షలతో నాలుగు బస్తీ దవఖానాలను నిర్మించారు. మిర్యాలగూడ పట్టణం సుందరంగా రూపుదిద్దుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ 30000 కోట్లతో దేశానికి తలమానికమైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను దామచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తుంది .. 4276 ఎకరాలలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు బాయిలర్ ను నిర్మిస్తుంది ఈ ప్రాజెక్టు పూర్తికి 2200 మంది కార్మికులు పనిచేస్తున్నారు ఇప్పటికే 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి.

వీటి అవసరాల కోసం11.5 టీఎంసీల నీటి స్టోరేజ్ కలిగిన రిజర్వాయర్ పూర్తి చేశారు ఈ రిజర్వాయర్కు తేల్బాండ్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నుంచి నీటిని తరలించేందుకు పైపులైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. బొగ్గు రవాణాకు విష్ణుపురం నుండి థర్మల్ పవర్ దక్కు ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 4 00 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చి వ్యవసాయానికి పరిశ్రమలకు కరెంటు పోత తీరుస్తుంది. వేలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

నియోజకవర్గంలో రైతుబంధు , రైతు బీమా ద్వారా వేలాది పెద్ద కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత భాస్కర రావుది. మిర్యాలగూడలో ఎన్వీఆర్ ఫౌండేషన్ పేరుతో మిర్యాలగూడలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఘనత ఎమ్మెల్యే భాస్కరరావు మరియు తనయుడు సిద్ధార్థ కు దక్కుతుంది.

మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఉన్న భాస్కర్ రావు సాగర్ దిగువ ప్రాంతంలో ఉన్న రైతుల కష్టాలను అర్థం చేసుకొని గిట్టుబాటు ధర కోసం రైస్ మిల్లు యజమానంతో సరైన ధరలో నిర్ణయించిన ఘనత భాస్కర్ రావు ది అని రైతులు కొనియాడుతున్నారు.

You may also like

Leave a Comment