Telugu News » MODI VS RAHUL : 2024 పార్లమెంట్ ఎన్నికలు.. మోడీ కీ గ్యారెంటీ VS రాహుల్ ఫ్రీ బీస్.. ఏది దేశానికి బెటర్!

MODI VS RAHUL : 2024 పార్లమెంట్ ఎన్నికలు.. మోడీ కీ గ్యారెంటీ VS రాహుల్ ఫ్రీ బీస్.. ఏది దేశానికి బెటర్!

పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల అటెన్షన్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ(BJP), ప్రతిపక్ష కాంగ్రెస్(Congress) పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోలపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముందుగా కాంగ్రెస్ పార్టీ ‘న్యాయపత్ర’ పేరుతో (ఏప్రిల్-5)న మేనిఫెస్టోను విడుదల చేయగా..

by Sai
2024 Parliament Elections.. Modi Key Guarantee VS Rahul Free Bees and Cast & Cash!

పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల అటెన్షన్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ(BJP), ప్రతిపక్ష కాంగ్రెస్(Congress) పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోలపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముందుగా కాంగ్రెస్ పార్టీ ‘న్యాయపత్ర’ పేరుతో (ఏప్రిల్-5)న మేనిఫెస్టోను విడుదల చేయగా.. అంబేడ్కర్ జయంతి సందర్భంగా (ఏప్రిల్ 14)న బీజేపీ ‘సంకల్ప పత్ర’ పేరుతో మేనిఫెస్టో (Manifesto) ను విడుదల చేసింది. అయితే, ఈ రెండు పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోలకు గల వ్యత్యాసం ఏమిటో, ఏ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు, దేశానికి మేలు చేసేలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

2024 Parliament Elections.. Modi Key Guarantee VS Rahul Free Bees and Cast & Cash!
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రధానంగా ‘పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీస్’ ట్యాగ్ లైన్‌తో వస్తుండగా.. అందులో యువన్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, సామాజిక న్యాయ్, శ్రామిక్ న్యాయ్ వంటి అంశాలతో పాటు కులగణన, ఉద్యోగాల కల్పన, మహిళలకు ఏడాదికి రూ.1లక్ష పంపిణీ వంటి అంశాలను మేనిఫెస్టోలో హైలేట్ చేశారు.

బీజేపీ మేనిఫెస్టో కేవలం ‘మోడీ కీ గ్యారెంటీ’ అనే ట్యాగ్ లైన్‌తో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. బీజేపీ మేనిఫెస్టోలో పేదలు, యువకులు, రైతులు, మహిళల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా మొత్తం 14 అంశాలను పొందుపరిచారు. అయితే, బీజేపీ మేనిఫెస్టోలో కులగణన గురించి ప్రస్తావించకపోయినా ఉచితాల జోలికి మాత్రం పోలేదు. దాని స్థానంలో మహిళలకు ఆర్థికంగా శక్తివంతంగా తయారుచేసేందుకు మోడీ కీ గ్యారెంటీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధానంగా కులగణన, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేత, 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, యువతకు ఒక ఏడాది పాటు శిక్షణా కార్యక్రమం, పేద మహిళలకు ఏడాదికి రూ.1లక్ష నగదు అందజేత, జీఎస్టీ పన్ను విధానంలో మార్పులు, ఎంఎస్ పీకి చట్టబద్ధత దీనితో పాటు కర్ణాటక, తెలంగాణలో అమలు చేసిన విధంగా ఉచిత పథకాల మీదే కాంగ్రెస్ ‘పాంచ్ న్యాయ్’ ఆధారపడి ఉన్నది. అనగా కాంగ్రెస్ పార్టీకి జనాలు ఓట్లేసి గెలిపిస్తే వారికి ఉచితాలు అందించడం, మోడీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన కొన్ని విప్లవాత్మక మార్పులను కాంగ్రెస్ తిరిగి మార్పులు చేయనున్నట్లు ప్రకటించింది.

ఇక మోడీ కీ గ్యారెంటీ పేరుతో వచ్చిన బీజేపీ మేనిఫెస్టోలో ఉచితాలను పెద్దగా ప్రస్తావించకుండా వచ్చే పదేళ్లలో దేశంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నామో అని డెమో ఇచ్చారు. యువత, రైతులు,మహిళలకు పెద్దపీట వేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉచిత రేషన్‌ను మరో ఐదేళ్లు పొడిగించారు. 3 కోట్ల మహిళలకు ఫ్రీ హోమ్స్, పేదలకు ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్, సూర్య ఘర్ స్కీం కింద ఉచిత విద్యుత్తు, ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు, ట్రాన్స్‌ జెండర్లకూ ‘ఆయుష్మాన్ భారత్’, జన ఔషధి కేంద్రాల్లో 80 శాతం రాయితీ, 70ఏళ్లు పైబడిన వారికి రూ.5లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు, దేశవ్యాప్తంగా బుల్లెట్ ట్రెయిన్స్ సంఖ్య పెంపు, త్వరలోనే 3 రకాల వందే భారత్ రైళ్లు, 2029లో జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌరసృతి (యూసీసీ) గురించి ప్రస్తావించారు.

గతంలో బీజేపీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ‘ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ రద్దు, సీఏఏ అమలు, మౌలిక వసతుల కల్పన, డిజిటల్ ఇండియా,రైల్వేలో మౌలిక వసతుల కల్పన, కొత్త రైల్వేలైన్ల విస్తరణ ఇలా అన్నింటినీ పూర్తి చేసింది. చ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని తప్పకుండా చేసి చూపిస్తామని, భారత్ ఆర్థిక వ్యవస్థను మూడో స్థానం నిలపడం.. ఇవన్నీ మోడీ కీ గ్యారెంటీ ద్వారా సాధ్యం అవుతాయని మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోడీ తెలిపారు.

దేశం అభివృద్ధి చెందాలంటే ఉచితాలను నివారించి, సంపదను సృష్టించాలి. ఉచితాలతో ఉద్యోగాల కల్పన, మౌలిక వసతుల కల్పన, అభివృద్ది ఎన్నిటికీ సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని నిరుద్యోగ యువత, మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు వారిని ఉచితాలకు బానిసలుగా చేయకుండా వారి చేత సంపద సృష్టించేలా ప్రభుత్వాలు చొరవ చూపాలి. ఉద్యోగ కల్పన అనేది మౌలిక సదుపాయాలు కల్పన, పరిశ్రమల స్థాపనతో సాధ్యం అవుతుంది. ఆ విధంగా ప్రభుత్వాలు నడుం బిగించాలి. అంతేకానీ కేవలం అధికారం కోసం ఉచితాలను ప్రకటిస్తూ దేశ భవిష్యత్‌ను ప్రమాదంలో పడవేయడం సరికాదు. ఇటువంటి విషయాలపై అవగాహన కలిగిన దేశంలోని యువత, మహిళలు మోడీ కీ గ్యారెంటీ మేనిఫెస్టోపై సానుకూల అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఉచితాలు దేశాన్ని సర్వనాశనం చేస్తాయని ప్రధాని మోడీ సైతం పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే.

You may also like

Leave a Comment