Telugu News » Konda Surekha : ఈసీకి మంత్రి లేఖ.. భద్రాద్రి రామయ్య కల్యాణం విషయంలో ఆలోచించండని రిక్వెస్ట్..!

Konda Surekha : ఈసీకి మంత్రి లేఖ.. భద్రాద్రి రామయ్య కల్యాణం విషయంలో ఆలోచించండని రిక్వెస్ట్..!

సుమారు నాలుగు వందల సంవత్సరాలుగా భద్రాచలం ఆలయం విశిష్టత, ఆచార సంప్రదాయాలు సమాజంలో అంతర్లీనమయ్యాయని పేర్కొన్నారు..

by Venu

లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి (Bhadradri) సీతారాముల కల్యాణ (Sitaramula Kalyanam) ఘట్టాన్ని లైవ్​ ఇవ్వొద్దని ఈసీ ఇటీవల ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.. కాగా ఈ విషయంలో స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha).. ఈ కల్యాణాన్ని ప్రభుత్వం తరఫున ప్రత్యక్షప్రసారం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఈవో వికాస్​రాజ్​కు లేఖ రాశారు.

Bhadrachalam: Vasantotsavam as festival of eyes in Bhadradri..!ఈ అంశంపై మరోసారి పరిశీలించి, అనుమతించాలంటూ కోరారు. మరోవైపు ఈ నెల 17న శ్రీరామ నవమి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు.. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న క్రమంలో భద్రాద్రి రామయ్య కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం చేయరాదని ఈసీ ఈ నెల 4న ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం..

అదీగాక సుమారు నలభై ఏళ్లుగా రామయ్య కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షప్రసారం చేయడం సంప్రదాయంగా ఉందని మంత్రి ఈసీకి వివరించారు. అలాగే ఈ కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని దేశ, విదేశాల్లోని లక్షల మంది వీక్షిస్తారని తెలిపారు. సుమారు నాలుగు వందల సంవత్సరాలుగా భద్రాచలం ఆలయం విశిష్టత, ఆచార సంప్రదాయాలు సమాజంలో అంతర్లీనమయ్యాయని పేర్కొన్నారు..

అందుకే స్వామివారి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని సీఈవోను మంత్రి కొండా సురేఖ కోరారు. మరోవైపు రామయ్య కల్యాణ ఘడియలు దగ్గర పడుతున్న వేళ, భద్రాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. దేశంలోనే రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారాముల కల్యాణం వీక్షించడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తారు..

You may also like

Leave a Comment