Telugu News » Himachal Pradesh: అందమైన రాష్ట్రంలో.. 400 మంది మృతి!

Himachal Pradesh: అందమైన రాష్ట్రంలో.. 400 మంది మృతి!

వర్షం, వరదలు, కొండ చరియలు విరిగిపడటం వంటి విపత్తులో రాష్ట్రంలో సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి జగత్‌సింగ్‌ నేగి తెలిపారు.

by Sai
400 people died during monsoon says himachal minister

భారతదేశంలో అందమైన రాష్ట్రాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) ఒకటి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో వచ్చిన భారీ వర్షాల (Heavy Rains) తో రాష్ట్రం అతలాకుతలంగా మారింది. రాష్ట్రం సర్వనాశనం అయింది. భారీ వర్షాలు, వరదలతో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో ప్రాణనష్టం బాగానే జరిగింది. గడచిన 2 నెలల్లోనే భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో 400 మంది మృతి చెందారని రాష్ట్ర రెవిన్యూ మంత్రి జగత్‌సింగ్‌ నేగి (Jagat Singh Negi) తెలిపారు.

400 people died during monsoon says himachal minister

ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌ అతలాకుతలమైన విషయం తెలిసిందే. వర్షం సంబంధిత విపత్తులో రాష్ట్రంలో సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి జగత్‌సింగ్‌ నేగి తెలిపారు. వర్షం కారణంగా సంభవించిన వరదలతో ఆ రాష్ట్రం పూర్తిగా దెబ్బతింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. సుమారు రూ.10 వేల కోట్లకుపైనే ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా వేశారు.

వర్షం, వరదలు, కొండ చరియలు విరిగిపడటం వంటి విపత్తులో రాష్ట్రంలో సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి జగత్‌సింగ్‌ నేగి తెలిపారు. జూన్‌ 24వ తేదీన రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించడంతో కుండపోతగా వర్షాలు కురిశాయి. ఈ విపత్తులో సుమారు 400 మంది మరణించినట్లు మంత్రి తాజాగా వెల్లడించారు. మరో 400 మందికి పైగా గాయపడ్డట్లు చెప్పారు. ఇప్పటి వరకు 2,500 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, 11,000 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని వివరించారు.

“రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం అమలులో ఉన్నందున మేము చట్ట సవరణలను కోరవలసి ఉంటుంది. ఈ విషయంలో మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతాము” అని శ్రీ నేగి అన్నారు. అయితే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ గురించి విలేకరులు ప్రశ్నంచగా.. కేంద్ర ప్రభుత్వం పిలిచే ప్రత్యేక వర్షాకాల సమావేశాల్లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, లోక్‌సభ ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ఇలాంటి ప్రకటనలు చేస్తోందని జగత్ సింగ్ నేగి అన్నారు.

“భారతదేశం ఇప్పటికే ఒక దేశంగా ఉంది, ఇటువంటి సమస్యలను లేవనెత్తడం ద్వారా బిజెపి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తోంది.” ”దేశంలో ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు వారు ప్రయత్నిస్తున్నారని నేను అడగాలనుకుంటున్నా. ఈ మొత్తం ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 6 నుంచి 7 నెలల సమయం పడుతుంది. ఇది దేశ ఆర్థిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది, దీని కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. అని శ్రీ నేగి అన్నారు.

You may also like

Leave a Comment