Telugu News » Name of YSR in CBI Charge sheet: సోనియాగాంధీతో సమావేశ వివరాలు త్వరలోనే వెల్లడిస్తా: షర్మిళ

Name of YSR in CBI Charge sheet: సోనియాగాంధీతో సమావేశ వివరాలు త్వరలోనే వెల్లడిస్తా: షర్మిళ

తెలిసి తెలిసి రాజశేఖర్ రెడ్డ కుటుంబానికి కానీ, ఆయనకు కానీ ఎలాంటి ద్రోహం చేయాలనే ఆలోచనే లేదన్నారు. వైఎస్సార్ లేని లోటు మాకు ఇవాళ తెలుస్తుందని సోనియాగాంధీ అన్నారని షర్మిళ తెలిపారు.

by Prasanna

 

వైఎస్సార్ (YSR) అంటే కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ (Sonia Gandhi)కి, రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి అపారమైన గౌరవముందని వైఎస్ షర్మిళ అన్నారు. ఇవాళ పంజాగుట్ట వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జీ షీట్ లో కాంగ్రెస్ చేర్పిందని, ఆ విషయాన్ని తాను రెండు రోజుల క్రితం సోనియాగాంధీని కలసినప్పుడు ప్రస్తావించానని అన్నారు.

Sharmila, sonia, Rahul

వైఎస్సార్ అంటే అపారమైన గౌరవమున్న తాము ఆ పని చేస్తామా అని సోనియా గాంధీ సమావేశంలో చెప్పారని అన్నారు. అలాగే తెలిసి తెలిసి రాజశేఖర్ రెడ్డ కుటుంబానికి కానీ, ఆయనకు కానీ ఎలాంటి ద్రోహం చేయాలనే ఆలోచనే లేదన్నారు. వైఎస్సార్ లేని లోటు మాకు ఇవాళ తెలుస్తుందని సోనియాగాంధీ అన్నారని షర్మిళ తెలిపారు.

“కాంగ్రెస్ వైఎస్సార్ విషయంలో ఏదైనా పొరపాటు చేసినట్లైయితే అది తెలియక జరిగిందే కానీ, తెలిసి చేసినది కాదని అర్థమైంది. నా తండ్రి వైఎస్సార్ కు సోనియా, రాహుల్ అపారమైన గౌరవం ఇస్తున్నారనే నిర్థరణకు వచ్చిన తర్వాతే సమావేశమయ్యాను. వాళ్లు వైఎస్సార్ విషయంలో రియలైజేషనుకు వచ్చారు. అది అర్థం చేసుకకోవలసిన బాధ్యత నాది.” అని షర్మిళ అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో జరిగిన చర్చల పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తానని చెప్పారు.

కేసీఆర్ తెలంగాణాను దోచుకున్నారని, కేసీఆర్ పాలన అంతమవ్వాలని షర్మిళ అన్నారు. రాజకీయాలు అంటే వండినట్లు, తిన్నట్లు కాదని, ఓపికతో ఉండాలన్నారు. తనతో పాటు నడిచి, తనకు అండదండలు అందించిన ప్రతి నాయకుడు, కార్యకర్తను నిలబెడతానన్నారు

You may also like

Leave a Comment