ప్రముఖ వ్యాఖ్యాత సుమ (Suma Kanakala) మీడియాకు క్షమాపణలు (sorry To media) చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్(x) ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సుమ ఏమన్నారంటే.. “మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు నేనొక ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమవుతోంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నా. మీరెంత కష్టపడి పనిచేస్తారో నాకు తెలుసు. మీరు, నేను కలిసి కొన్నేళ్ల నుంచి ప్రయాణిస్తున్నాం. నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొంది.
అసలు ఏం జరిగిందంటే.. ‘ఆదికేశవ’ సినిమాలోని ‘లీలమ్మో’ పాట విడుదల వేడుకను చిత్ర బృందం హైదరాబాద్‌లో బుధవారంసాయంత్రం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సుమ యాంకర్‌గా వ్యవహరించారు. ఆ సందర్భంలో యాంకర్ సుమ మీడియా వారు స్నాక్స్ భోజనంలా తింటున్నారని.. స్నాక్స్‌లా తింటే బాగుంటుందని అన్నారు. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ ఓ విలేకరి అలా అనకుండా ఉంటే.. బాగుండేదని ఓ విలేకరి అభిప్రాయం వ్యక్తం చేశారు.
మీడియా వారంతా తనతో చాలాకాలంగా కలిసి ప్రయాణిస్తున్నారని, ఆ చనువుతో జోక్‌గా మాట్లాడానని సుమ సమాధానమిచ్చారు. ‘మీరు స్నాక్స్‌లానే తిన్నారు ఓకేనా..?’ అని సుమ అడగ్గా.. ‘ఇదే వద్దనేది. మీ యాంకరింగ్ అందరికీ ఇష్టమేగానీ మీడియా విషయంలో ఇలాంటివి వద్దు..’ అని సదరు విలేకరి ఘాటుగా సమాధానమిచ్చారు. దీంతో ఓ వీడియోలో సారీ చెప్ప్తూ సుమ ట్విట్టర్ (x)లో వీడియోను రిలీజ్ చేశారు.