Telugu News » Parmanand Tolani: పట్టువదలని విక్రమార్కుడు.. ఎన్నికల్లో 18సార్లు ఓడినా మళ్లీ నామినేషన్..!

Parmanand Tolani: పట్టువదలని విక్రమార్కుడు.. ఎన్నికల్లో 18సార్లు ఓడినా మళ్లీ నామినేషన్..!

మధ్యప్రదేశ్‌కు చెందిన ఇందౌర్‌ నివాసి పర్మానంద్‌ తోలని(Parmanand Tolani) వివిధ ఎన్నికల్లో 18సార్లు ఓటమి పాలయ్యారు. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. 19వ సారి నామినేషన్‌(Nomination) వేశారు.

by Mano
Parmanand Tolani: Persistence Vikramarku.. Despite losing the election 18 times, he is nominated again..!

ఎమ్మెల్యే కావాలనేది ఆయన కల. అందు కోసం 35ఏళ్లుగా వరుసగా 18సార్లు నామినేషన్ వేశాడు. ఆ 18సార్లు అతడికి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. దీనికి ఆ వ్యక్తి ఏమాత్రం చింతించలేదు. పట్టువదలని విక్రమార్కుడిగా మరోసారి పోటీకి సై అంటూ నామినేషన్‌ దాఖలు చేశాడు.

Parmanand Tolani: Persistence Vikramarku.. Despite losing the election 18 times, he is nominated again..!

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌(Madyapradesh)కు చెందిన ఇందౌర్‌ నివాసి పర్మానంద్‌ తోలని(Parmanand Tolani) వివిధ ఎన్నికల్లో 18సార్లు ఓటమి పాలయ్యారు. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. 19వ సారి నామినేషన్‌(Nomination) వేశారు. 63 ఏళ్ల వయసు ఉన్న పర్మానంద్‌ తన తండ్రి 1988లో మృతిచెందగా ఆ తర్వాతి సంవత్సరం నుంచి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు తెలిపారు.

పర్మానంద్‌ పోటీ చేసిన అన్నీ ఎన్నికల్లోనూ ఆయనకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. వరుస పరాజయాలను చవిచూసిన ఆయనకు చివరికి ‘ఇందౌర్‌ ధర్తి పకడ్‌’ అనే బిరుదును పర్మానంద్‌ సొంతం చేసుకోవడం విశేషం. ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల తన ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పర్మానంద్ చెప్తున్నాడు. నవంబర్ 17న జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేశాడు.

ఈ ఎన్నికల్లో ఇందౌర్-4 స్థానం నుంచి ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. పర్మానంద్‌ కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. గతంలో ఆయన తండ్రి ప్రింటింగ్‌ ప్రెస్‌ నడుపుతూ 30ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత నుంచి తాను నామినేషన్‌ వేయడాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపాడు పర్మానంద్‌. ఆయన కుటుంబ సభ్యులు కూడా కొన్ని ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైయ్యారు.

తన భార్య గతంలో మేయర్‌ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైందని, తమ కుటుంబం నుంచి ఏ ఒక్కరూ ఇంతవరకు గెలుపొందలేదని పర్మానంద్‌ తెలిపాడు. అయినా వెనుకంజ వేయకుండా.. తనే కాదు.. తన తర్వాతి తరం కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే 1000 చదరపు అడుగుల భవనాలపై పూర్తిగా ఆస్తి పన్ను మినహాయించడం సహా నగరపాలక సంస్థ వసూలు చేసే పన్నులను రద్దు చేస్తానని పర్మానంద్‌ ఓటర్లకు హామీ ఇచ్చారు.

You may also like

Leave a Comment