Telugu News » KTR : కాంగ్రెస్ అంటేనే.. రైతు విరోధి!

KTR : కాంగ్రెస్ అంటేనే.. రైతు విరోధి!

కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ (ఎక్స్) లో ఉత్తమ్ వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. ఇంటింటికి మంచినీళ్లు.. 24 గంటల కరెంట్ కూడా ఆపెయ్యమంటరేమో? అంటూ సెటైర్లు వేశారు.

by admin

తెలంగాణ (Telangana) లో ఎన్నికల కోడ్ ఉంది. అయితే.. దీనికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ.. కాంగ్రెస్ (Congress) నేతలు ఢిల్లీ (Delhi) లోని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మాట్లాడుతూ.. ఎన్నిక‌ల కోడ్ ఉన్నప్పుడు ప్ర‌భుత్వ ప‌రంగా ఎలాంటి కార్య‌క్ర‌మాలు, సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించి నిధులు విడుద‌ల చేయకూడ‌ద‌ని అన్నారు. కానీ, బీఆర్ఎస్ (BRS) స‌ర్కార్ లబ్ధిదారులకు జ‌మ చేస్తోందంటూ ఆరోప‌ణ‌లు చేశారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఓట‌ర్లు ప్ర‌భావితం అయ్యే అవ‌కాశం ఉంద‌ని ఆరోపించారు.

కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. ట్విట్టర్ (ఎక్స్) లో ఉత్తమ్ వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. ఇంటింటికి మంచినీళ్లు.. 24 గంటల కరెంట్ కూడా ఆపెయ్యమంటరేమో? అంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ అంటేనే.. రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందన్నారు. అంతేకాదు, అన్నదాత పాలిట నెంబర్ వన్ విలన్ అంటూ విమర్శించారు. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ కుట్రను తెలంగాణ రైతులు సహించరని హెచ్చరించారు.

అన్నదాతల పొట్టకొట్టే కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరని చెప్పారు కేటీఆర్. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా అని మండిపడ్డారు. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి.. కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నారని చురకలంటించారు. తెలంగాణ రైతులకు.. కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక 3 గంటల మోసానికి తెర తీశారని అన్నారు.

రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు కేటీఆర్. జై కిసాన్.. జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ అంటూ ట్వీట్ ను ముగించారు.

You may also like

Leave a Comment