Telugu News » Amith shah: బ్రిటీష్ కాలం నాటి చట్టాల్లో మార్పులు.. త్వరలోనే పార్లమెంటులో ఆమోదం: అమిత్‌షా

Amith shah: బ్రిటీష్ కాలం నాటి చట్టాల్లో మార్పులు.. త్వరలోనే పార్లమెంటులో ఆమోదం: అమిత్‌షా

హైదరాబాద్‌(Hyderabad)లోని నేషనల్ పోలీస్ అకాడమిలో 75వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. 175 మంది ట్రెయినీ ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకోవడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

by Mano
Amith shah: Changes in the laws of the British era.. soon approved in the parliament: Amit shah

బ్రిటీష్ కాలం నాటి చట్టాలను మార్చాల్సి ఉందని కేంద్ర హోంమంత్రి(Central Home minister) అమిత్‌షా(Amith shah) తెలిపారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు కాలం చెల్లిందన్న అమిత్‌షా వాటి స్థానంలో కొత్త చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే తమ ప్రభుత్వం కొత్త నేర చట్టాల బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పారు.

Amith shah: Changes in the laws of the British era.. soon approved in the parliament: Amit shah

హైదరాబాద్‌(Hyderabad)లోని నేషనల్ పోలీస్ అకాడమిలో 75వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. 175 మంది ట్రెయినీ ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకోవడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి అమిత్ ముఖ్యఅతిథిగా హాజరై ట్రెయినీ ఐపీఎస్‌ల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ట్రెయినీ ఐపీఎస్ 14 మందిని తెలుగు రాష్ట్రాలకు కేటాయించారు.

‘బ్రిటీష్ కాలం నాటి 3 చట్టాలను మార్చాల్సి ఉంది. సీఆర్పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్ చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉంది. ఈ మూడు చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసి పార్లమెంట్ ముందుంచింది. త్వరలోనే నేర చట్టాల బిల్లు ఆమోదం పొందుతుంది. శాసననాలను సురక్షితంగా ఉంచడమే పాత చట్టాల ఉద్దేశంగా ఉండేది. ప్రజల హక్కులను సురక్షితంగా ఉంచడం కొత్త చట్టాల ఉద్దేశం. కొత్త చట్టాల ఆధారంగా అధికారులు ప్రజలకు రక్షణ కల్పించాలి’ అని అమితా పిలుపునిచ్చారు.

అదేవిధంగా ‘మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించాయి. కర్తవ్య నిర్వహణలో అమరవీరుల బలిదానం ప్రేరణ కావాలి. వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు సవాళ్లు విసురుతున్నాయి. క్రిప్టో కరెన్సీతో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనానికి యత్నిస్తున్నారు. హవాలా, నకిలీ నోట్ల కట్టడికి మరింత పటిష్ఠంగా పోరాడాలి.’ అని అమిత్‌షా అన్నారు.

 

You may also like

Leave a Comment