Telugu News » Azahruddin: రూ. 392 ఉన్న క్రికెట్ బాల్ రూ.1400.. క్రికెట్ లో అజారుద్దీన్ లీలలు..!!

Azahruddin: రూ. 392 ఉన్న క్రికెట్ బాల్ రూ.1400.. క్రికెట్ లో అజారుద్దీన్ లీలలు..!!

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అజారుద్దీన్ టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని జస్టిస్ లావ్ నాగేశ్వరరావు కమిటీ నాలుగు కేసులు నమోదు చేసింది.. ఈ కమిటీ ఆగస్టు 10వ తేదీన ఆడిట్ నిర్వహించి క్రికెట్ బాల్స్ కొనుగోలు వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగినట్టు గుర్తించింది.

by Venu

క్రికెట్ (Cricket) క్రీడారంగంలో గొప్ప ఫాలోయింగ్ ఉన్న ఆట.. క్రికెట్ ఆటగాళ్లకు కూడా ఫ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఈ ఆటలో కీర్తి ప్రతిష్టలు, డబ్బుకు కొదువే లేదు. ఆటగాళ్ళంటే అభిమానులకు పిచ్చి.. మరి ఇంతటి పేరు ప్రఖ్యాతులు సాధించిన క్రికెట్ రంగాన్ని అప్పుడప్పుడు బెట్టింగ్, అవినీతి అనే భూతాలు పట్టి పీడిస్తున్నాయి. ఇక ఇప్పటికే హెచ్ సీఏ (HCA) మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ (Azahruddin)పదవిలో ఉన్న సమయంలో కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కేసు కూడా నమోదైంది.

మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అజారుద్దీన్ టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ నాలుగు కేసులు నమోదు చేసింది.. ఈ కమిటీ ఆగస్టు 10వ తేదీన ఆడిట్ నిర్వహించి క్రికెట్ బాల్స్ కొనుగోలు వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగినట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం మల్కాజ్ గిరి కోర్టును అజారుద్దీన్ ఆశ్రయించారు..

మరోవైపు అజారుద్దీన్ రూ. 392 ఉన్న క్రికెట్ బాల్ ను రూ.1400 వర్క్ ఆర్డర్ చేసినట్టు జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ కనుగొంది. క్రికెట్ బాల్స్ కొనుగోలు వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు 57 లక్షల రూపాయల నష్టం, బకెట్ కుర్చీల కొనుగోలులో రూ. 43 లక్షలు, ఫైర్ ఫైటింగ్ పరికరాల కొనుగోలు వ్యవహారంలో రూ.1.50 కోట్లు, జిమ్ పరికరాల పేరుతో రూ.1.53 కోట్లు నష్టం వచ్చిందని ఈ కమిటీ పేర్కొంది.

ఈ విషయంలో అజారుద్దీన్ పై ఉప్పల్ (Uppal) పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు అజారుద్దీన్. తాజాగా ముందస్తు బెయిల్ కోరుతూ మల్కాజ్ గిరి కోర్టులో పిటిషన్ వేశారు ఈ మాజీ క్రికెటర్.. కాగా అజారుద్దీన్ బెయిల్ పిటిషన్ పై మల్కాజిగిరి కోర్టు నవంబర్ ఒకటవ తేదీన విచారణ చేపట్టనుంది.

You may also like

Leave a Comment