ప్రేక్షకుల చేత నేషనల్ క్రష్ (National Crush)గా పిలిపించుకుంటున్న రష్మిక మందన్న (Rashmika Mandanna) పుష్ప (Pushpa) సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ (Pan India heroine)గా మారిపోయింది. ప్రస్తుతం అన్ని భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది ఈ అందాల భరణి.. మరోవైపు సౌత్ టు నార్త్ ఫుల్ బిజీగా ఉన్న రష్మిక బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది.
ఈ నేషనల్ క్రష్ మరో వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు రెడీ కూడా అవుతుంది. అయితే తాజాగా ఈ భామ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాను షూటింగ్స్ ఎక్కువ ఉండడం వలన ట్రావెలింగ్ ని ఎంతో మిస్ అవుతున్నానని తెలిపింది.
మనస్సు, మైండ్ రిలాక్స్ అవ్వాలంటే కొత్త ప్రదేశాలకి వెళ్ళడం.. ప్రకృతిని ఆస్వాదించడం లాంటివి తరచుగా చేస్తుండండని, వీటన్నింటినీ ముందే ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుందని రష్మిక తెలిపింది.
మనస్సు బాగోలేనప్పుడు నచ్చిన స్నేహితులతో కాస్త ముచ్చటించడం వల్ల తెలికపడుతుందని చెప్పిన రష్మిక.. ట్రావెల్ లో కలిగే ప్రతి అనుభూతి గొప్పగా అనిపిస్తుంది. అది చాలా మిస్ అవుతున్నాను అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది..