Telugu News » Renjusha Menon: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్ర‌ముఖ న‌టి సూసైడ్..!

Renjusha Menon: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్ర‌ముఖ న‌టి సూసైడ్..!

భ‌ర్త మ‌నోజ్‌తో క‌లిసి ఉంటున్న ఫ్లాట్‌లో రెంజూష ఉరేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగానే ఆమె తీవ్ర నిర్ణ‌యం తీసుకుంద‌ని స‌మాచారం.

by Mano
Renjusha Menon: Tragedy in the film industry.. Famous actress suicide..!

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. మ‌ళ‌యాళ న‌టి రెంజూష మీన‌న్(35)(Renjusha Menon) సోమ‌వారం ఉద‌యం తిరునంత‌పురం(Tiruvananthapuram)లోని త‌న ఫ్లాట్‌లో విగ‌త‌జీవిగా కనిపించ‌డం క‌ల‌క‌లం రేపింది. భ‌ర్త మ‌నోజ్‌తో క‌లిసి ఉంటున్న ఫ్లాట్‌లో రెంజూష ఉరేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగానే ఆమె తీవ్ర నిర్ణ‌యం తీసుకుంద‌ని స‌మాచారం.

Renjusha Menon: Tragedy in the film industry.. Famous actress suicide..!

రెంజూష మీన‌న్ ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని ప్రాథమికంగా నిర్ధారించినా ఆమె మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. కొచ్చికి చెందిన రెంజూష మీన‌న్ ఆరంభంలో టీవీషో యాంక‌ర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది. ఆపై టీవీ సీరియ‌ల్స్ ద్వారా బుల్లితెర‌పై మెరిసి పెద్ద‌సంఖ్య‌లో ప్రేక్ష‌కాభిమానుల‌ను సంపాదించుకుంది

రెంజూషా మొదట యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళ సీరియల్ ‘స్త్రీ’తో నటిగా రంగప్రవేశం చేసింది. ‘నిజలాట్టం,’ ‘మగలుడే అమ్మ,’ బాలామణి’ లాంటి ధారావాహికల్లో కనిపించింది. అంతే కాకుండా ‘సిటీ ఆఫ్ గాడ్’ మరియు ‘మెరిక్కుండోరు కుంజడు’ అనే సినిమాల్లో కూడా కనిపించింది. చివరిసారిగా ‘ఆనందరాగం’ అనే టీవీ షోలో లీడ్‌ రోల్ పాత్ర పోషించింది.

రెంజూషా మీనన్ సూసైడ్ చేసుకోవడానికి కొన్ని గంటల ముందే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో రీల్స్ చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించింది. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

You may also like

Leave a Comment