Telugu News » Faria Abdullah: ‘జాతిరత్నాలు-2’ ఆ సినిమా తర్వాతే.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన చిట్టి..!

Faria Abdullah: ‘జాతిరత్నాలు-2’ ఆ సినిమా తర్వాతే.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన చిట్టి..!

చిట్టి పాత్రలో తనదైన హావభావలతో చెరగని ముద్ర వేసుకుంది. తొలి సినిమాతోనే విజయాన్ని సొంతం చేసుకున్న ఈ భామ ఇప్పుడు అల్లరి నరేష్ హీరోగా ‘ఆ ఒక్కటీ అడ్డక్కు’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

by Mano
Faria Abdullah: 'Jatiratnalu-2' is after that movie.. Chitti gave an amazing update..!

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) గురించి ఇప్పుడు టాలీవుడ్‌లో తెలియని వారు ఉండరు. ‘జాతిరత్నాలు'(Jathiratnalu) సినిమాలో చిట్టి పాత్రలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. చిట్టి పాత్రలో తనదైన హావభావలతో చెరగని ముద్ర వేసుకుంది. తొలి సినిమాతోనే విజయాన్ని సొంతం చేసుకున్న ఈ భామ ఇప్పుడు అల్లరి నరేష్ హీరోగా ‘ఆ ఒక్కటీ అడ్డక్కు’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Faria Abdullah: 'Jatiratnalu-2' is after that movie.. Chitti gave an amazing update..!

ఈ సినిమా మే 3వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఫరియా ఇప్పుడు బిజీబిజీగా ఉంది. జాతిరత్నాలు సూపర్ హిట్ కావడంతో ‘జాతిరత్నాలు-2’(Jathiratnalu-2) ఉంటుందనే వార్తలు వస్తున్నక్రమంలో ఫరియా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపింది. “జాతిరత్నాలు’ మూవీ నిర్మాతలు ప్రస్తుతం ‘కల్కి 2898AD’ తో బిజీగా ఉన్నారు. అది పాన్ ఇండియా సినిమా కాబట్టి అది పూర్తయ్యాక ఉంటుందని అనుకుంటున్నా అని తెలిపింది.

తానూ ‘జాతిరత్నాలు-2’ కోసం ఎదురుచూస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక ఫరియా “ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో సిద్ది అనే పాత్రలో నటిస్తోంది ఈ సినిమా స్టోరీ పూర్తిగా పెళ్లి చుట్టే తిరుగుతుందని తెలిపింది. వైవిధ్యమైన పాత్రలతో మాస్ మసాలా మూవీ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఈ రోజుల్లో అందరికీ అవసరమయ్యే కంటెంట్ ఉన్న సినిమా అని వెల్లడించింది. అల్లరి నరేశ్ కామెడీ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.

చాలా కాలం తర్వాత ఈ సినిమాలో అల్లరి నరేశ్ కడుపుబ్బా నవ్వించబోతున్నారని ఫరియా తెలిపింది. అంతేకాదు.. జాతి రత్నాలుతో పోలిస్తే ఇందులో కామెడీ భిన్నంగా ఉంటుందని చెప్పింది. పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక. ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చేశాయని, పెళ్లి సంబంధాలను మ్యాట్రిమొనీల్లో ఎలా మేనేజ్ చేస్తారనే అంశాలను ఆసక్తికరంగా ఉంటాయని తెలిపింది. ఫరియా ప్రస్తుతం తెలుగు, తమిళంలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ‘మత్తు వదలరా 2’, ‘భగవంతుడు’, ఓ తమిళ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

You may also like

Leave a Comment