బాన్సువాడ (Banswada)లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy)పై ఈ దాడి జరిగిన విషయం తెలిసిందే.. దాడి ఘటన పై ఇప్పటికే మంత్రి హరీష్ రావు (Harish Rao) సీఎం కేసీఆర్ (CM KCR) స్పందించారు. తీవ్రస్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు.
మరోవైపు ప్రభాకర్ రెడ్డి పై జరిగిన దాడి ప్రతిపక్షాల పని అని సీఎం కేసీఆర్ కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఎంపీ పై దాడి విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)స్పందించారు. హింసను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొదని, అహింసా మూల సిద్ధాంతంగా పని చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపీ పై దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరన్నా కానీ అతని పై కేసు నమోదు చేసి విచారణ జరపాలని కోరారు.
కాగా ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డి పై దాడి విషయంలో తక్షణమే పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి వెనుక రాజకీయ కోణం ఉందని మంత్రి హరీష్ రావు విమర్శించిన విషయం విదితమే..