Telugu News » Rahul Gandhi: ఇది దొరల తెలంగాణకు, ప్రజా తెలంగాణకు మధ్య పోరాటం….!

Rahul Gandhi: ఇది దొరల తెలంగాణకు, ప్రజా తెలంగాణకు మధ్య పోరాటం….!

ఈ ఎన్నికల్లో ఓ వైపు కేసీఆర్, ఆయన కుటుంబం మరో వైపు తెలంగాణ ప్రజలు నిలబడ్డారని చెప్పారు.

by Ramu

ఈరోజు జరుగుతున్న ఎన్నికల సమరం దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణ (Telangana)కు మధ్య జరుగుతున్న పోరాటం అని కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఈ ఎన్నికల్లో ఓ వైపు కేసీఆర్, ఆయన కుటుంబం మరో వైపు తెలంగాణ ప్రజలు నిలబడ్డారని చెప్పారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు రోజూ చూస్తూనే ఉన్నారని చెప్పారు.

ఈ ప్రభుత్వం చేసిన అతి పెద్ద మోసం అంటే కాళ్వేశ్వరం ప్రాజెక్టు అని విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి లక్ష కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కొల్లగొట్టయన్నారు. ఈ లక్ష కోట్ల రూపాయాలను పేద,రైతుల నుంచి పన్నుల రూపంలో తీసుకుని స్వలాభం కోసం వాడుకున్నారని ఆరోపించారు. ఏడాది కాకముందే కాళ్వేశ్వరం ప్రాజెక్టు శిథిలావస్థకు వచ్చిందన్నారు.

కాంగ్రెస్ కూడా గతంలో రాష్ట్రంలో ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించిందన్నారు. సింగూరు, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, జూరాల ప్రాజెక్టులను కట్టామన్నారు. తాము కట్టిన ప్రాజెక్టులను, కాళేశ్వరం ప్రాజెక్టులను మధ్య భేదాన్ని గమనించాలన్నారు. తాము దళితులు, పేదలు, ఆదివాసీలకు వాళ్ల భూములను వాళ్లకు ఇచ్చామన్నారు.

ఇప్పుడు ఆ భూములను కేసీఆర్ సర్కార్ దౌర్జన్యంగా లాక్కొంటోందన్నారు. కంప్యూటరైజేషన్ పేరటి ధరణితో మొత్తం భూములను లక్కునే ప్రయత్నం జరుగుతోందన్నారు. ధరణి వల్ల కేవలం కేసీఆర్ కుటుంబం, ఆయన ఎమ్మెల్యేలు,మంత్రులకు మాత్రమే న్యాయం జరిగిందని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

తెలంగాణ సంపద అంతా కేసీఆర్ కుటుంబం చేతుల్లోకి పోతోందన్నారు. ప్రజా తెలంగాణ వస్తుందని ప్రజలంతా కల కన్నారని, పోరాటం చేశారని అన్నారు. అంతే కానీ దొరల తెలంగాణ కోసం కాదన్నారు. ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు. మహాలక్ష్మీ పథకం కింద వివాహితకు రూ. 2500లు అంజేస్తామన్నారు. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు.

ఎన్నికల తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించే అవకాశం కల్పిస్తామన్నారు. రైతులకు ఎకరానికి రూ. 15 వేలు, కౌలు రైతులకు రూ. 12వేలు ఇచ్చి ఆదుకుంటుందన్నారు. ఇండ్లు కట్టుకునే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లకింద రూ. 5 లక్షలను ఇస్తామన్నారు.

యువ వికాసం కింద విద్యార్థులకు ఫీజులు, యువకులకు రూ. 5 లక్షలతో విద్యా భరోసా కార్డు ఇస్తుందన్నారు. వృద్ధుల పింఛన్ రూ. 4 వేలకు పెంచుతామన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య యుద్దం జరుగుతోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎమ్ఐఎమ్ కలిసి పోరాటం చేస్తున్నాయన్నారు.

పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశ పెట్టిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. అన్ని పార్టీల నేతలపై దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేస్తున్నాయన్నారు. కానీ కేసీఆర్ మీద మాత్రం ఎలాంటి ఈడీ లేదన్నారు. దేశంలో ఎక్కడ బీజేపీకి అవసరమైన అక్కడ ఎంఐఎమ్ లబ్ది చేకూర్చేలా ప్రయత్నాలు చేస్తోందన్నారు. బీజేపీకి, ఎమ్ఐఎంకు ఓటు వేసినా అది పరోక్షంగా బీఆర్ఎస్ కు చేరుతుందన్నారు.

2024లో బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకునే సామర్థ్యం కాంగ్రెస్ కే ఉందన్నారు. తెలంగాణలో డబ్బు, అధికారం, మీడియా అన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయన్నారు. కానీ కాంగ్రెస్ కు మాత్రం ప్రజాబలం ఉందన్నారు. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు కలిపి ప్రజల తెలంగాణ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.

ఇందిరా గాంధీ వర్దంతి ఈరోజ అని గుర్తు చేశారు. మన బంధం కేవలం రాజకీయ బంధం కాదని, కుటుంబ బంధం అని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు ఇందిరా గాంధీకి తెలంగాణ సమాజం అండగా నిలబడిందన్నారు. తెలంగాణ ఫలాలు బీద, మహిళ, రైతులు, యువకులకు అందుతాయని అన్నారు. కానీ అలా జరగలేదన్నారు.

 

You may also like

Leave a Comment