Telugu News » Kamareddy : కామారెడ్డిలో ఉద్యమ ద్రోహి పోటీ చేస్తా అనడం హాస్యాస్పదం..కేటీఆర్..!!

Kamareddy : కామారెడ్డిలో ఉద్యమ ద్రోహి పోటీ చేస్తా అనడం హాస్యాస్పదం..కేటీఆర్..!!

మంత్రి కేటీఆర్ (KTR) ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS)ని గెలిపించడానికి తన వంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కామారెడ్డి (Kamareddy)లో నిర్వహించిన బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

by Venu

తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం (CM) కేసీఆర్ (KCR) మూడోసారి విజయం సాధించి హ్యట్రిక్ కొట్టాలాని చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్ధుల ఎత్తులకు తగ్గట్టుగా పావులు కదుపుతూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ (KTR) ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS)ని గెలిపించడానికి తన వంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కామారెడ్డి (Kamareddy)లో నిర్వహించిన బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఏ కారణంతో కామారెడ్డిని ఎంచుకున్నాడని రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారని అన్నారు. కామారెడ్డిలో భూములు గుంజుకోవడానికి కేసీఆర్ వస్తున్నారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నియోజకవర్గం అని ఒక్కసారి ముద్రపడితే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ భావించి.. కేసీఆర్ ను కామారెడ్డిలో పోటీ చేయాలని కోరినట్టు కేటీఆర్ తెలిపారు.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో.. ఎక్కడి నుంచైనా గెలువగలిగే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్‌ అన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ పై ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి పోటీ చేస్తా అని అనడం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు ఆందోళన చెందవద్దని.. గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ మాత్రమే ఉంటుందని వెల్లడించారు.

కొత్త ప్లాన్ ను రద్దు చేసినట్లు కేటీఆర్‌ చెప్పారు. కాగా నవంబర్ 9న కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ వేస్తారని తెలిపారు. కేసీఆర్ ను గెలిపిస్తే.. కామారెడ్డి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని అన్నారు. మరోవైపు కేటీఆర్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పౌరుషానికి ప్రతీకగా ఉన్న నేలకు కేసీఆర్‌ వస్తున్నందుకు సంతోషిస్తున్నానని అన్నారు.. కాబట్టి కుల, మతాలకు అతీతంగా కేసీఆర్‌కు అఖండ మెజార్టీ కట్టబెట్టాలని కేటీఆర్‌ ఓటర్లను కోరారు..

You may also like

Leave a Comment