Telugu News » Revanth-Reddy : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కాదది స్కామేశ్వరం.. రేవంత్ రెడ్డి..!!

Revanth-Reddy : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కాదది స్కామేశ్వరం.. రేవంత్ రెడ్డి..!!

టీపీసీసీ చీఫ్ రేవంత్ (Revanth-Reddy) ఈ అవినీతి పై ఉడుం పట్టు పట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు మార్లు ప్రాజెక్ట్ పై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీలో తాజాగా చోటుచేసుకున్న ‘బుంగ’(పైపింగ్ యాక్షన్) ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

by Venu
Revanth reddy wrote an open letter to cm kcr

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project)కథ ప్రతిపక్షాలకు వరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ (Medigadda Lakshmi Barrage)లో ఉన్న లోపాలపై ముఖ్యంగా కాంగ్రెస్ (Congress)పార్టీ దుమ్మెత్తి పోస్తుంది. ఇప్పటికే హస్తంలోని నేతలందరు ఈ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

revanth reddy

ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ (Revanth-Reddy) ఈ అవినీతి పై ఉడుం పట్టు పట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు మార్లు ప్రాజెక్ట్ పై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీలో తాజాగా చోటుచేసుకున్న ‘బుంగ’(పైపింగ్ యాక్షన్) ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే నేడు అన్నారం బ్యారేజీలో మరో లోపం బైటపడిందన్న రేవంత్.. అది కాళేశ్వరం ప్రాజెక్టు కాదని.. కేసీఆర్ స్కామేశ్వరం అని ట్వీట్ ద్వారా ఫైర్ అయ్యారు. ఇప్పుడు కూలుతున్నవి బ్యారేజీలు కాదని.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు, ఆశలు అని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కంటే కేసీఆర్ కట్టుకున్న ఫామ్ హౌజ్ ప్రహరీ గోడ గట్టిగా ఉందని ఎద్దేవా చేశారు రేవంత్..

లక్ష కోట్ల ప్రజాధనాన్ని మింగేసి నాలుగు కోట్ల జనం నోట్లో మట్టిగొట్టారని కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు గీసిన పనికిమాలిన డిజైన్లు నీ పదవి కాలం ముగిసే వరకి కూడా ఉండటం లేదని.. వందేళ్లకు పైగా ఉనికిలో ఉండాల్సిన నిర్మాణాలు కండ్లముందే కొట్టుకుపోవడానికి కారణమేంటని రేవంత్ ప్రశ్నించారు.

You may also like

Leave a Comment