కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ (CM KCR) దొచుకున్న ప్రజాధనాన్ని తిరిగి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అందించబోతోందని చెప్పారు. కేసీఆర్ పాలనలో ఒక కుటుంబానికి మాత్రమే ప్రయోజనం జరిగిందని, నష్టం మాత్రం తెలంగాణ మొత్తానికి జరిగిందన్నారు.
కల్వకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ…. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల కలలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. దొరల ప్రభుత్వంలో ధరణి పేరిట 20 లక్షల మంది రైతులకు నష్టం కలిగించారని ఆరోపణలు గుప్పించారు.
సీఎం కేసీఆర్ తనకు తాను ఓ రాజులాగా భావిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని చెప్పారు. ఇది దొరలకు ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు. తొలుత కేసీఆర్ పదవికి బైబై చెప్పి ఆ తర్వాత అతను దోచుకున్న డబ్బులను రాబట్టాలన్నారు.
తొలుత కేసీఆర్ పదవికి బైబై చెప్పేలా చేయాలన్నారు. ఆ తర్వాత కేసీఆర్ దోచుకున్న ధనాన్ని రాబట్టాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుకుంటూ పోయారని, చివరకు లక్ష కోట్ల వరకు తీసుకెళ్లారని ఆరోపించారు. అదంతా పేదల సొమ్మేనన్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పిల్లర్లన్నీ ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయని చెప్పారు. లక్ష కోట్ల ధనాన్ని దొంగతనం చేసినా ప్రాజెక్టును మాత్రం సక్రమంగా నిర్మించలేకపోయారని ఫైర్ అయ్యారు.