Telugu News » Liquor Bottles: ప్రమాదానికి గురైన కారులో లిక్కర్ బాటిళ్లు.. ఎగబడ్డ జనం..!

Liquor Bottles: ప్రమాదానికి గురైన కారులో లిక్కర్ బాటిళ్లు.. ఎగబడ్డ జనం..!

భారీగా అక్రమ మద్యం(foreign liquor) తరలిస్తున్న ఓ వాహనం ప్రమాదానికి గురైంది. వెంటనే అందులో ఉన్నవారిని కాపాడడానికి స్థానికులు పరుగులు తీశారు.

by Mano
Liquor Bottles: Liquor bottles in the accident car.. People jumped..!

భారీగా అక్రమ మద్యం(foreign liquor) తరలిస్తున్న ఓ వాహనం ప్రమాదానికి గురైంది. వెంటనే అందులో ఉన్నవారిని కాపాడడానికి స్థానికులు పరుగులు తీశారు. అయితే వాహనంలో ఉన్న వ్యక్తులు తాము ఎక్కడ దొరికిపోతామేమోనని భయంతో గాయాలతోనే అక్కడి నుంచి పరారయ్యారు. ఇంకేముంది.. అందులో ఉన్న లిక్కర్ బాటిళ్లను చూసిన స్థానికులు అందిన కాడికి దోచుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Liquor Bottles: Liquor bottles in the accident car.. People jumped..!

ఈ విచిత్ర ఘటన కొన్నేళ్లుగా మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీహార్‌లోని గయ జిల్లాలో సోమవారం (అక్టోబర్ 30) ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలు ఇలా ఉన్నాయి. గయ నుంచి ధోబీ-ఛత్రా వెళ్లే జాతీయ రహదారి 99లోని ఛత్రా మలుపు వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. కారు నిండా విదేశీ తయారీ మద్యం ఉన్నాయి. కారులో ఉన్న వారిని కాపాడేందుకు జనం పరుగులు తీశారు. కానీ మద్యం నిషేధం అమలో ఉన్న నేపథ్యంలో తాము దొరికిపోకూడదనే ఉద్దేశంతో కారులో ఉన్న వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.

బీహార్‌లో 2016 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేదం అమలులో ఉంది. అయినా అక్కడ మద్యం అమ్మకాలు యథావిధిగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భారీ అక్రమంగా మద్యం తరలుతోందనడానికి ఈ సంఘటనే నిదర్శనం. ప్రజల ఆరోగ్యాలు, కుటుంబాలను దృష్టి పెట్టుకొని అక్కడి ప్రభుత్వం మద్యాన్ని నిషేదించినా ఇలా అక్రమార్కుల ద్వారా మద్యం సరఫరా ఏమాత్రం తగ్గడంలేదు.

You may also like

Leave a Comment