Telugu News » Congress : వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న టీ కాంగ్రెస్.. చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధం..!!

Congress : వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న టీ కాంగ్రెస్.. చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధం..!!

టీ పీసీసీ అధ్యక్షుడు (TPCC President) రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)తన ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ని గట్టిగానే అరుసుకుంటున్నాడని అనుకుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అవినీతిని బయటికి తీసుకు వస్తామని శపథం కూడా చేశారు కాంగ్రెస్ నేతలు..

by Venu
congress party releases 2nd list of candidates for telangana assembly elections

తెలంగాణ (Telangana)లో ఎన్నికలు జరగడానికి సమయం ఎక్కువగా లేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ (BRS)సభల మీద సభలు నిర్వహిస్తూ, పోటీలో ఉన్న అభ్యర్థులకు సపోర్ట్ గా ఎన్నికల ప్రచారం చేస్తుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ (Congress)కూడా గట్టిపట్టు మీదనే ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో రాజకీయ పీఠం లక్ష్యంగా టీ కాంగ్రెస్ నేతలు ముందుకు వెల్లుతున్నారు. హస్తం మీద ఉన్న నిందను మాపడానికి తీవ్రంగా శ్రమిస్తున్న నేతలు.. ప్రస్తుతం కాస్త చల్లపడినట్టు కనిపిస్తుంది. సొంత పార్టీ నేతల మీద ఆరోపణలు తగ్గించి విజయం పై దృష్టి సారించారని కార్యకర్తలు సంబరపడుతున్నారు.

మరోవైపు పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారాన్ని జోరుగా షురూ చేశాయి. ఇక టీ పీసీసీ అధ్యక్షుడు (TPCC President) రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)తన ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ని గట్టిగానే అరుసుకుంటున్నాడని అనుకుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అవినీతిని బయటికి తీసుకు వస్తామని శపథం కూడా చేశారు కాంగ్రెస్ నేతలు.. ఇలాంటి విభిన్న పరిస్థితుల్లో తెలంగాణలో విజయం క్యాడ్బరీ చాక్లెట్ లా ఊరిస్తుందని ప్రజల్లో టాక్..

మరోవైపు కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమనే నమ్మకంతో, అభివృద్థి మంత్రంతో బీఆర్ఎస్ ముందుకి వెల్లుతుండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతిని అస్త్రంగా మలుచుకుని ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు గాంధీభవన్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది.

ఎన్నికల ప్రచారంపై బూత్ స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఈ ట్రైనింగ్ కార్యక్రమం 3వ తేదీన ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు జరగనుందని పార్టీనేతల సమాచారం. మరోవైపు 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 500 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొననుండగా.. రేవంత్ రెడ్డి, మాణిక్ రావు ఠాక్రే, భట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

You may also like

Leave a Comment