తెలంగాణ (Telangana) రాజకీయాల్లో జనసేన (Janasena) ఎప్పుడు ఫుల్ స్టాప్ లేని కామా లా మిగిలిపోతుందని అనుకుంటున్నారు. అనుకుంటున్నట్టే పవన్ రాజకీయాలు రాష్ట్రంలో ఆసక్తిగా మారాయి అనే చర్చ సాగుతుంది. అందులో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఏదో ఒకటి తేల్చుకోక సాగదీయడం వల్ల జనసేన అభిమానులు నిరాశ పడుతున్నారని అనుకుంటున్నారు.
ఇప్పటికే బీజేపీ (BJP)తో కలిసి ఎన్నికలకు వెళ్లాలి అని నిర్ణయించుకున్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పోటీ చేసే అంశంపై ఏం చెబుతారా అని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రశ్నల చిక్కుముడి వీడాలంటే పవన్ కల్యాణ్‌తోనే సాధ్యమని భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌లు పొత్తుకోసం పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని స్నేహ హస్తం అందించారు. వారి ప్రతిపాదనను స్వాగతించిన పవన్ కేంద్ర హోంశాఖ మంత్రితో సైతం భేటీ అయ్యారు.
కానీ జనసేన స్థానాలపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. మరోవైపు బీజేపీ అభ్యర్థుల జాబితాలో జనసేన పేరు వినబడక పోవడంతో జనసైనికుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు పవన్ కల్యాణ్ శుక్రవారం లేదా శనివారం ఫుల్ స్టాప్ పెడతారని అంతా భావిస్తున్నారు. కాగా టికెట్ల సర్ధుబాటు, కేటాయింపులపై బీజేపీ, జనసేన ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.