Telugu News » Bus Accident: బస్సు ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన.. విచారణకు సీఎం జగన్ ఆదేశం..!

Bus Accident: బస్సు ప్రమాద మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన.. విచారణకు సీఎం జగన్ ఆదేశం..!

ఉదయం ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు అందజేశారు. ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ఫ్లాట్ ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు.

by Mano
cm jagan convened high level meeting

విజయవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ బస్టాండ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

cm jagan convened high level meeting

ఈ రోజు ఉదయం విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ బస్టాండ్‌లో 12వ నంబర్ ఫ్లాట్ ఫైమ్‌పైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. అందులో ఓ కండక్టర్‌తో పాటు ఓ మహిళ, 10నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు.

ఉదయం ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు అందజేశారు. ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ఫ్లాట్ ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. ఈ మేరకు ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు.

ఇక, బస్సు ప్రమాదంపై మీడియాతో మాట్లాడిన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు.. ఈ ప్రమాదం దురదృష్టకరమన్నారు. ఉదయం 8:45గంటలకు 26 మంది ప్రయాణికులతో బస్సు బయల్దేరినప్పుడు ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదం యాంత్రిక లోపమా, మానవ తప్పిదమా అనేది తేలాల్సి ఉందన్నారు. బాధిత కుటుంబాలకు ఆర్టీసీ తరఫున రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని చెప్పారు.

 

You may also like

Leave a Comment