Telugu News » ఈ సెలెబ్రెటీలు… బంధువులన్న విషయం మీకు తెలుసా..?

ఈ సెలెబ్రెటీలు… బంధువులన్న విషయం మీకు తెలుసా..?

by Sravya

సినీ ఇండస్ట్రీలో చాలామంది బంధువులు ఉన్నారు కానీ చాలామందికి ఈ విషయం తెలీదు. వాళ్లు యాక్టర్స్, వీళ్లు యాక్టర్స్ అని మనకు తెలుసు, కానీ ఈ ఇద్దరు యాక్టర్లు కూడా బంధువులు అన్న విషయం తెలీదు. అలా ఒకళ్ళిద్దరూ కాదు చాలామంది సెలబ్రిటీలే ఉన్నారు. తెలుగు నటుడు తొట్టెంపూడి గోపీచంద్ శ్రీకాంత్ మేనకోడలైన రేష్మ ని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ ఇలా బంధువులు అయ్యారు.

అలానే ఇంకా చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. వాళ్ళ వివరాలు కూడా చూద్దాము. దర్శకుడు బోయపాటి శ్రీను గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. బోయపాటి శ్రీను ఎన్నో మంచి సినిమాలతో హిట్లు కొట్టారు. బోయపాటి శ్రీను పోసాని మురళీకృష్ణ కజిన్స్ అవుతారు. డైరెక్టర్ గా బోయపాటి శ్రీను నటుడుగా పోసాని మురళీకృష్ణ మనకి తెలుసు కానీ వీళ్ళిద్దరూ కజిన్స్ అనే విషయం మనకి తెలియదు.

చోటా కె నాయుడు మేనల్లుడు సందీప్ కిషన్. సందీప్ కిషన్ హీరోగా ఇప్పటికే పలు సినిమాలు చేసి అందర్నీ మెప్పించాడు. అలానే సిరివెన్నెల సీతారామశాస్త్రి మేనకోడలు త్రివిక్రమ్ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా బంధువులు.

ఏఎం రత్నం కొడుకు రవికృష్ణ సెవెన్ బై జి బృందావన కాలనీ సినిమాలో నటించి అందర్నీ మెప్పించాడు. తర్వాత సినిమాల్లో పెద్దగా కనపడలేదు. రాజమౌళి భార్య రమ కి గుణ్ణం గంగరాజు కజిన్ ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు.

Also read:

అలానే సుద్దాల అశోక్ తేజ మేనల్లుడు ఉత్తేజ్. చంద్రశేఖర్ ఏలేటి గుణ్ణం గంగరాజు భార్య కి సోదరుడు. బావ మరిది అవుతాడు. మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ కూడా కజిన్స్. శర్వానంద్ సోదరుడు రామ్ సోదరుని పెళ్లి చేసుకున్నారు. ఇలా వీళ్ళిద్దరూ కూడా బంధువులు అయ్యారు. పోసాని మురళీకృష్ణ మావయ్య కొరటాల శివ. వీళ్ళు ఇద్దరు కూడా ఇలా బంధువులే.

You may also like

Leave a Comment