తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నదని నేతలు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలంతో పాటు సీఎం కేసీఆర్ చరిష్మా కూడా రాబోయే ఎన్నికల్లో మరోసారి కలిసి రానున్నదనే ధీమాతో జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ (BRS) తెలంగాణ (Telangana)లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలనే లక్ష్యం పెట్టుకున్నదంటున్నారు అ పార్టీ నేతలు, కార్యకర్తలు.. మరోవైపు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరింప చేయాలనే ఆలోచనతో ఇన్నాళ్లూ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల పై దృష్టి సారించారని బీఆర్ఎస్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదే సమయంలో సీఎం కేసీఆర్ (CM KCR)పై ఎంపీ నామా నాగేశ్వరరావు (MP Nama Nageshwarrao) కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నిర్వహించే ప్రతి సభ విజయవంతం అవుతుందని అన్నారు. ఇక కేసీఆర్ సభ అయితే ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తోందని వెల్లడించారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ నిర్వహించిన రెండు సభలు విజయవంతం అయ్యాయని నాగేశ్వరరావు తెలిపారు.
ఈ నియోజక వర్గం ప్రజలు కారు గుర్తుకి ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నామా కోరారు. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమకు బ్రహ్మాండమైన మెజార్టీ కట్టబెడతాయని తెలిపారు. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ చరిష్మా తగ్గిందనే ప్రచారం కూడా జరుగుతుంది.
ఇప్పటికే ఖమ్మం రాజకీయాలు పొయ్యిమీది పెనంలా కాలుతున్నాయని.. ఎన్నికల రిజల్ట్ వరకి ఆగకుండా మీకు మీరే విజేతలని ప్రకటించుకుంటే ఎలక్షన్స్ ఎందుకు.. డబ్బులు బొక్క అని సామాన్యుడు దెప్పిపొడుస్తున్నాడని లోకం అనుకుంటుంది.