Telugu News » Sharmila : దొంగలు.. సీఎంలు కాలేరు!?

Sharmila : దొంగలు.. సీఎంలు కాలేరు!?

వైఎస్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్‌ కు షర్మిల మద్దతు ప్రకటించారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన విమర్శలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. తాను పార్టీ పెట్టినప్పుడు తమకు సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారని.. మరి ఇప్పుడు ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. ఏపీ పరిస్థితి ఎలా ఉందో కేసీఆరే సభల్లో చెబుతున్నారని… ముందు అక్కడి నేతలు దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఏపీ దుస్థితిపై అక్కడి నేతలు ఆలోచిస్తే మంచిదని పరోక్షంగా జగన్ రెడ్డికి కూడా షర్మిల సలహా ఇచ్చారు.

by admin
YS Sharmila Shocking Comment

– కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు
– మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే..
– ఎన్ని ఘోరాలు చూడాలో
– బీజేపీ, బీఆర్​ఎస్​ ఒకటే
– రహస్య ఒప్పందం ఉంది
– గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి..
– గులాబీ ఎంపీలు కాషాయ పార్టీకి..
– మద్దతుగా ఉండాలన్నదే ఒప్పందం
– రాష్ట్రానికి వస్తున్న మోడీ..
– సీబీఐ విచారణ చేయిస్తారా?
– రేవంత్ రెడ్డి దొంగ అని నేను అనలేదు..
– సుప్రీంకోర్టే చెప్పింది
– షర్మిల కీలక వ్యాఖ్యలు

కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్ (CM KCR) కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టు నిర్మించారని వైటీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) వివరించారు. హైదరాబాద్ (Hyderabad) లో మీడియాతో మాట్లాడిన ఆమె.. రూ.లక్ష కోట్ల స్కాం జరిగిందని తాము గతంలోనే చెప్పామన్నారు. దేశంలోనే ఇది అతి పెద్ద కుంభకోణమని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం కూలిపోయే దుస్థితికి వచ్చాయని.. ఈసారి బీఆర్ఎస్ (BRS) గెలిస్తే రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. కుక్క తోక తగిలితే కూలిపోయే పరిస్థితిలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ఉందన్నారు.

YS Sharmila Shocking Comment

అన్నారం పంపు హౌస్, మేడిగడ్డ పరిస్థితిపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వాళ్ళు నిగ్గు తేల్చారని చెప్పారు షర్మిల. 20 అంశాలపై వివరణ అడిగితే 11 అంశాలపై క్లారిటీ ఇచ్చారని పేర్కొన్నారు. బ్యారేజ్ నిర్మాణమే వేస్ట్ అని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిందని వెల్లడించారు. మేడిగడ్డకు వచ్చిన ఇబ్బంది రాబోయే రోజుల్లో అన్నారం, సుందిళ్లకు ప్రమాదం రానుందని హెచ్చరించిందని తెలిపారు. కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టుల వ్యయాన్ని భారీగా పెంచారని షర్మిల ఆరోపించారు.

ఇదే ప్రాజెక్టు‌ను రాజశేఖర్ రెడ్డి రూ.38 వేల కోట్లతో నిర్మాణం చేయాలని భావిస్తే.. దానిని కేసీఆర్ లక్ష కోట్లకు పెంచి 18 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామన్నారని తెలిపారు. కేసీఆర్.. వైఎస్ కంటే కేవలం రెండున్నర ఎకరాలకు మాత్రమే పెంచారన్నారు. అసెంబ్లీ వేదికగా సాగునీటిపై అనేక అబద్ధాలు ఆడారని మండిపడ్డారు. మొదట్నుంచి కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడిన ఒకే ఒక్క పార్టీ వై​​టీపీ అని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్​ఎస్​ ఒకటేనని.. ఆ రెండు పార్టీలు రహస్య ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి.. గులాబీ ఎంపీలు కాషాయ పార్టీకి మద్దతుగా ఉండాలన్నదే వీరి ఒప్పందమన్నారు.

కేంద్రమంత్రులే కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి, ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు షర్మిల. తెలంగాణ ప్రజలపై బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. బీఆర్ఎస్ కు ఎంఐఎం పార్టీ నేరుగా మద్దతు ఇస్తుంటే… బీజేపీ రహస్యంగా సపోర్ట్ చేస్తోందని విమర్శించారు. అందుకే, ప్రధాని మోడీ.. కేసీఆర్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పారు. తెలంగాణకు ప్రధాని వస్తున్న సందర్భంగా.. కాళేశ్వరం ప్రాజెక్టుపై, సీఎం కేసీఆర్ పై, మేఘా కృష్ణారెడ్డిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొంగ అని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు షర్మిల. కేసు డిస్మిస్ కోసం కోర్టుకెళ్తే రేవంత్ దోషి అని న్యాయస్థానం చెప్పిందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి కాదు.. రేటెంత రెడ్డి అని అంటున్నారన్నారని.. ఆ పేరు తాను పెట్టింది కాదని అన్నారు. అన్ని పార్టీల్లో దొంగలు ఉంటారని.. అలాంటి వారు ఎప్పుడూ సీఎంలు కాలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసమే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న ఆమె.. ఎవరో వచ్చి తమకు కిరీటాలు పెట్టాలని కోరుకోవట్లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు, వైఎస్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్‌ కు షర్మిల మద్దతు ప్రకటించారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన విమర్శలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. తాను పార్టీ పెట్టినప్పుడు తమకు సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారని.. మరి ఇప్పుడు ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. ఏపీ పరిస్థితి ఎలా ఉందో కేసీఆరే సభల్లో చెబుతున్నారని… ముందు అక్కడి నేతలు దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఏపీ దుస్థితిపై అక్కడి నేతలు ఆలోచిస్తే మంచిదని పరోక్షంగా జగన్ రెడ్డికి కూడా షర్మిల సలహా ఇచ్చారు.

You may also like

Leave a Comment