Telugu News » Azharuddin : అజారుద్దీన్‌ కి అడ్డు తగులుతున్న అవినీతి కేసులు.. నేడు తీర్పు..!!

Azharuddin : అజారుద్దీన్‌ కి అడ్డు తగులుతున్న అవినీతి కేసులు.. నేడు తీర్పు..!!

అజారుద్దీన్ హెచ్‌సీఏలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్ చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరిగింది. దీంతో టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని రుజువైంది. ఈ విషయాన్ని గుర్తించిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌ అధికారులు, పోలీసులకి ఫిర్యాదు చేశారు.

by Venu

హెచ్‌సీఏ (HCA) మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ (Azharuddin)పై నాలుగు కేసులు నమోదు చేసి హైదరాబాద్‌ (Hyderabad) క్రికెట్‌ అసోసియేషన్‌ (Cricket Association) వార్తల్లో ఎక్కిన విషయం తెలిసిందే. అసలే ఎన్నికలు సమీపంలో ఉన్న సమయంలో ఈ కేసులు అజారుద్దీన్ కి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థిగా కాంగ్రెస్ (Congress) పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. అంతే కాకుండా పార్టీ నుంచి బీఫామ్ కూడా అందుకున్నారు.

ఇదిలా ఉండగా అజారుద్దీన్ హెచ్‌సీఏలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్ చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరిగింది. దీంతో టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని రుజువైంది. ఈ విషయాన్ని గుర్తించిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌ అధికారులు, పోలీసులకి ఫిర్యాదు చేశారు. కేసు కోర్టు వరకి వెళ్లడంతో.. సుప్రీం కోర్టు నిజానిజాలు తేల్చడానికి కమిటీని నియమించింది.

అవినీతి జరిగినట్టు గుర్తించిన జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు కమిటీ అజారుద్దీన్ పై 4 కేసులు పెట్టింది. కాగా తనపై నమోదైన నాలుగు కేసుల్లో.. అజారుద్దీన్ ముందస్తు బెయిల్ కోసం.. మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. ఈ పిటిషన్ పై వాదనలు ముగియగా.. కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది..మరోవైపు కోర్టు తీర్పు విన్న తరువాత నామినేషన్ వేయాలని అజారుద్దీన్‌ భావిస్తున్నట్టు సమాచారం.

You may also like

Leave a Comment