పదవి మీద ఆశ లేదని చెబుతారు.. ప్రజా సేవకోసమే రాజకీయాల్లోకి వచ్చామని అంటారు.. కాని పదవులే ఆరోప్రాణంగా బ్రతుకుతారు. ప్రజల కోసం ఉన్నామని, మీ కష్టం నా కష్టం అని ఎన్నో మాటలు చెబుతారు.. అధికారం దక్కగానే కన్నెత్తి చూడరు.. ఇదే కదా నేటి రాజకీయం ముఖ చిత్రమని ప్రజా సేవచాటున జరుగుతున్న దోపిడిని చూస్తున్న సామాన్యుడి ఆవేదన..
ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆశలు బాగానే ప్రజలకు కలిపిస్తున్నారని ఓటర్లు అంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు టీఆర్ఎస్ (TRS) అలియాస్ బీఆర్ఎస్ (BRS) కూడా ఎన్నో కాకమ్మ కబుర్లు చెప్పిందని తీరా రాష్ట్రం వచ్చాక అధికారం పై ఉన్న ఆశతో వారే పదవులు చేపట్టారని, నేతల మాటలు విని విని విసుగు చెందిన ఓటర్లు చెవులు కోరుక్కుంటున్నారు.
మరోవైపు భువనగిరి (Bhuvanagiri) ఎంపీ (MP) నల్లగొండ (Nalgonda) కాంగ్రెస్ (Congress) అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkata reddy) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవి మీద ఆశలేదంటూనే ఏదో ఒకరోజు నేను సీఎం అవుతానని అన్నారు. బీఆర్ఎస్ 2018లో మాయమాటలు చెప్పి గెలిచిందన్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
నల్గొండ జిల్లా ఆర్డీవో కార్యాలయంలో ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన కోమటిరెడ్డి.. నల్లగొండ నియోజక వర్గం నాకు రాజకీయ జన్మనిచ్చిందని.. నా ప్రాణం ఉన్నంతవరకు నల్లగొండ మర్చిపోనని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజల ఆదరణ చూస్తుంటే చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అంటూ ఎమోషనల్ అయ్యారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన బీఆర్ఎస్ ని నమ్మి మరోసారి మోసపోవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు..