గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి (Goshamahal BRS Candidate) ఎవరనేది గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. ఇప్పటికే రాజాసింగ్.. గోషామహల్ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. మరి బీఆర్ఎస్ ఎవరిని ప్రకటిస్తుందా అనే ప్రశ్నకు సమాధానంగా.. మంత్రి కేటీఆర్ (KTR). BRS అభ్యర్థిగా నంద కుమార్ బిలాల్ (Nanda Kumar Bilal)ను ప్రకటించారు.
గోషామహల్ టికెట్ కోసం పోటీ పడ్డ అశిస్ కుమార్ యాదవ్ (Ashish Kumar Yadav)ను బుజ్జగించిన కేటీఆర్.. ఆయన సమక్షంలో బిలాల్‌కు బీ ఫామ్ అందజేశారు. ఆశిష్ తో కలిసి పని చేయాలని బిలాల్‌కు ఆదేశాలు ఇచ్చారు కేటీఆర్. మరోవైపు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యే రాజాసింగ్ విజయం సాధించారు. కాగా బీజేపీ తరపున 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక అభ్యర్థి కూడా రాజాసింగ్ కావడం గమనార్హం.
అయితే బీఆర్ఎస్ గోషామహల్ లో పట్టుకోసం ప్రయత్నిస్తుంది. కానీ రాజాసింగ్ చరిష్మా ముందు కారు పప్పులు ఉడకలేదు. దీంతో ఈసారి ఎలాగైనా గోషామహల్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది బీఆర్ఎస్.. చివరకు నందకిషోర్ వ్యాస్.. సరైన నేతగా భావించి ఖరారు చేయడం రాజకీయ వర్గాలలో సర్వత్రా చర్చనీయాంగా మారింది. మరి పోరులో గెలిచేది ఎవరో తెలియాలంటే ఎన్నికల రిజల్ట్ వచ్చేదాకా ఆగవలసిందే..