రాష్ట్రంలో ఎన్నికలకు సమయం తగినంత లేకపోవడంతో రాజకీయ పార్టీలన్ని ప్రచారంలో వేగాన్ని పెంచాయి.. ప్రతి నియోజక వర్గాన్ని జల్లేడపడుతున్న బీఆర్ఎస్ (BRS) నేతలు మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. మరోవైరు ప్రజా ఆశీర్వాద సభలతో.. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు సీఎం (CM) కేసీఆర్ (KCR).. మంత్రులు కేటీఆర్ (KTR) హరీశ్‌రావు కూడా ప్రచారంలో భాగంగా పలు జిల్లాలు పర్యటిస్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో మల్కాజ్ గిరి (Malkajgiri)లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న హరీష్ రావు (Harish Rao) మైనంపల్లి హన్మంతరావు (Mainampally Hanmantha Rao)పై విమర్శలు గుప్పించారు. ప్రజలను తన డబ్బుతో, గుండాయిజంతో భయభ్రాంతులను చేస్తూ.. విజ్ఞత లేని రాజకీయాలు చేశాడని మైనంపల్లి పై హరీష్ రావు ఆరోపణలు చేశారు..
మల్కాజ్ గిరి నియోజకవర్గం హైదరాబాద్ నగరానికి గుండెకాయ వంటిదన్న హరీష్ రావు.. రాజశేఖర్ రెడ్డిని గెలిపిస్తే మల్కాజ్ గిరిని దత్తత తీసుకుంటా అని తెలిపారు. మైనంపల్లి డబ్బు మైనాన్ని ఓటుతో కరిగించి.. మర్రి రాజశేఖర్ రెడ్డి ని గెలిపించాలని హరీష్ రావు ఓటర్లను కోరారు..
ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీపై తనదైన శైలిలో మంత్రి హరీశ్ రావు విమర్శల వర్షం కురిపించారు. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి.. గల్లీలో తిడతారని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు స్థానిక నేతలు కొందరు బీఆర్ఎస్లో చేరారు.. వారికి గులాబీ కండువా కప్పి హరీశ్ రావు పార్టీలోకి ఆహ్వానించారు..